మహిళల్లో అకాల వృద్దాప్యమా.. ఈ మూడు విషయాలు తప్పక తెలుసుకోవాలి!

మహిళల్లో అకాల వృద్దాప్యమా.. ఈ మూడు విషయాలు తప్పక తెలుసుకోవాలి! ఇనుము చాలా బలమైనది మరియు శక్తివంతమైనది. సుత్తితో కొట్టినా కూడా అది విరిగిపోదు, కానీ  తుప్పు మాత్రం ఇనుమును కబళిస్తుంది.  అదే విషయం శరీరానికి కూడా వర్తిస్తుంది.  కొన్ని అలవాట్లు శరీరాన్ని దెబ్బ తీస్తాయి. దానివల్ల  వయసు పైబడిన   తరువాత రావలసిన వృద్ధాప్యం ముందే  వస్తుంది. దీన్నే అకాల వృద్ధాప్యం అంటారు. ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం మహిళల శరీరం హార్మోన్స్ పరంగానూ, ఒత్తిడి కారణంగానూ వివిధ మార్పులకు లోను కావడం. అకాల వృద్ధాప్యం  లక్షణాలు:   యవ్వనంలో  జుట్టు నెరిసిపోయి, బలహీనత-అలసట, శరీరంలో ఎముకల శబ్ధం, ముడతలు,  మధుమేహం రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే,  అకాల వృద్ధాప్యంతో బాధపడుతున్నారని అర్థం. దీన్ని నివారించడానికి  3 విషయాలను తప్పక తెలుసుకోవాలి.  మూడు  అలవాట్లు తొందరగా వృద్ధాప్యం రావడానికి కారణం అవుతుంది. ఈ అలవాట్లు వృద్ధాప్యాన్ని తొందరగా తీసుకువస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. మెలటోనిన్.. మెలటోనిన్ ఒక యాంటీఆక్సిడెంట్, దీనిని స్లీపింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది చీకటిలో లేదా రాత్రి సమయంలో మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది  పగటి వెలుగులో  ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా విడుదల అవుతుంది. నేటి కృత్రిమ జీవితాల్లో ప్రకృతికి దగ్గరగా ఉండటం తక్కువ. అందుకే రోజులో కొంతభాగం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఈ పని చేయడం వల్ల ఇది వృద్ధాప్యాన్ని పెంచే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తగ్గిస్తుంది . వ్యాయామం.. కొంతమంది తమకు ఇష్టం వచ్చినప్పుడు శారీరక శ్రమ చేస్తుంటారు. అదే సమయంలో, కొందరు  ప్రతిరోజూ వ్యాయామం, జిమ్ లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామం చేస్తారు. ఈ రెండు వర్గాల వారిని గమనిస్తే క్రమం తప్పకుండా ఒక ప్రణాళికతో వ్యాయామం చేసేవారికి వృద్ధాప్య ఛాయలు ఆమడ దూరంలో ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం సహజంగా యాంటీఆక్సిడెంట్లను విడుదల చేస్తుంది. కాబట్టి వ్యాయామం దగ్గర బోల్తా పడకండి.  ఎక్కువగా తినడం.. ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతూనే ఉంటారు చాలామంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవారిలో  యాంటీఆక్సిడెంట్ లోపం  ఏర్పడుతుంది. దీన్ని సరిచేయడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాలు కాస్త సేదతీరాలి.  అందుకే రోజులో  భోజనాన్ని  2 నుండి 3 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇవే మాత్రమే కాకుండా.... రోజూ తగినంత నీరు త్రాగాలి. శరీరంలో తేమ శాతం తగ్గితే చర్మం వాడిపోతుంది. జ్యుసి పండ్లు తినాలి. ఇందులో ముఖ్యంగా నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు ఉండాలి. రోజుకు రెండు పూటలా భోజనం చేయాలి. అది కూడా సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. నానబెట్టిన డ్రై ఫ్రూట్ తినాలి. ఇవి వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. మహిళలు పై విషయాలు తెలుసుకుని ఫాలో అయితే వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచొచ్చు.                                  *నిశ్శబ్ద.

కొలెస్ట్రాల్ ను అరికట్టాలంటే ఏం చేయాలో తెలుసా...?

1. కొలెస్ట్రాల్ ముప్పును తప్పించుకోవాలంటే ముందుగా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. 2. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్‌మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి. 3. నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్‌శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌ను వాడితే మరీ మంచిది. 4. తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకుంటే కొవ్వు దరిచేరకుండా ఉంటుంది. 5. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. 6. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి వారంలో రెండు, మూడుస్లార్లు చేపను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అదుపులో ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. 7. రోజూ సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది. 8. వెల్లుల్లిలో ఆర్గనో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్‌ను కాలేయానికి రవాణా చేస్తుంది. అందుకే రోజు రెండు మూడు రెబ్బల వెల్లుల్లి తీసుకోండి. 9. మెనూలో కూరగాయాల భోజనం ఉండేలా చూసుకోండి. వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. 10. రోజూ కార్డియో ఎక్సర్‌సైజులు చేయండి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌తో వచ్చే ముప్పుకు చెక్ పెట్టవచ్చనడంలో సందేహం లేదు! 11. మాంసాహారం తక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు.

బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే!

బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే! అధిక బరువు అంటే కాస్త భయపడాల్సిన కాలమిది. అధిక బరువు ఉన్నవారికి మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి అనేక జబ్బులు సులువుగా వస్తాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య కాసింత ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా  బరువు తగ్గడానికి రకరకాల డైట్ ప్లాన్‌లు ఫాలో అవుతుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. అయితే ఎక్కువ శ్రమ లేకుండా పొట్ట తగ్గాలంటే, ఆహారంలో పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి. చాలా పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా 8 రకాల పండ్లు బరువు తగ్గడంతో మ్యాజిక్ చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ద్రాక్ష.. ద్రాక్షపండులో కేలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించే పండుగా పరిగణించబడుతుంది . ఇది రోజువారీ కావాల్సిన విటమిన్ సి లో  51% అందిస్తుంది. ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. దీని వాడకం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. యాపిల్స్.. యాపిల్స్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక పెద్ద ఆపిల్‌లో 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. యాపిల్స్ తినే వ్యక్తులు 4 సంవత్సరాల కాలంలో ప్రతిరోజూ సగటున 0.56 కిలోల బరువు కోల్పోతారని పరిశోధనలో తేలింది. బెర్రీస్.. ఇవి తక్కువ కేలరీల పండ్లు. ఒక కప్పు  రాస్ప్బెర్రీస్ లో  కేవలం 64 కేలరీలు కలిగి ఉంటే, ఒక కప్పు  స్ట్రాబెర్రీలో 50 కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. బెర్రీలు తినడం వల్ల కొలెస్ట్రాల్, బిపి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది అధిక బరువు నియంత్రించడానికి సహాయపడుతుంది. కివి.. కివి పండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కివీస్ విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి.  12 వారాల పాటు రోజూ కివిని తింటే ఎంత ఎక్కువ ఉన్న బిపి అయినా తగ్గుతుంది.  పొట్ట కొవ్వు, నడుము కొవ్వు కూడా గణనీయంగా తగ్గిస్తుంది.   పుచ్చకాయ.. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఇది కాకుండా, నారింజ వంటి పండ్లు కూడా అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు, అవకాడోలు, పీచెస్, ప్లమ్స్, చెర్రీస్, ఆప్రికాట్ వంటి పండ్లు కూడా బరువు తగ్గడానికి గొప్ప ఎంపికలు.                                  ◆నిశ్శబ్ద

ప్రసవం తరువాత మహిళలు ఇవి తింటే అద్భుతమైన శక్తి సొంతమవుతుంది!

ప్రసవం తరువాత మహిళలు ఇవి తింటే అద్భుతమైన శక్తి సొంతమవుతుంది! ప్రసవం తరువాత స్త్రీలలో శారీరక, భావోద్వేగ మార్పులు చాలా ఉంటాయి. ఇవన్నీ హార్మోన్ల మార్పుల వల్ల జరిగేవి.. ఈ కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా జాగ్రత్త అవసరం.  డెలివరీ తరువాత కూడా తల్లిబిడ్డలకు ఇద్దరికీ సరైన జాగ్రత్త, సరైన వైద్య సేవలు అవసరమవుతాయి. ఈ హార్మోన్స్ ను, శారీరక స్థితిని తిరిగి మాములు స్థాయికి తిరిగి తీసుకుని రావడానికి అవి మాత్రమే కాకుండా ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రసవం తర్వాత శరీర మార్పులకు, స్థితికి తగ్గట్టు ఆహారాన్ని కూడా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో పోషకాలు అవసరమైన ఆహారం కూడా పుష్కలంగా తీసుకోవాలి. లేకపోతే శరీరం తొందరగా అలసిపోతుంది. బిడ్డకు పాలు ఇవ్వవడంలో సమస్యలు ఏర్పడటం నుండి మహిళల్లో అలసట, రక్తహీనత, ఎముకలు బలహీనంగా మారడం వంటి ఎన్నో సమస్యలు చాప కింద నీరులా చుట్టుముడతాయి.  మీరు ప్రసవానంతరం తొందరగా  కోలుకోవడానికి ఈ ఆహారాలు డైట్ లో భాగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.   పెసరపప్పు.. పెసరపప్పులో ఐరన్, పొటాషియం, కాపర్ మెగ్నీషియం, అలాగే ఫైబర్, విటమిన్ B6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. శరీరంలో  శక్తి స్థాయిని పెంచుతాయి బాదం.. బాదంపప్పులు నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి తీసుకునే ఆహారం శరీరంలో  శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. వేయించిన  గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం కంటెంట్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుమ్మడికాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.  వేయించిన గుమ్మడి గింజలను ప్రతిరోజూ కొద్దిగా తీసుకుంటే మంచిది.  బొప్పాయి బొప్పాయిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో సులభంగా శోషించబడతాయి, త్వరగా శక్తిని అందిస్తాయి. అదనంగా, బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇది ఆహారం నుండి పోషకాలను బాగా ఉపయోగించుకోవడంలో శరీరానికి సహాయపడుతుంది, శరీరానికి కావల్సిన శక్తి స్థాయిలను పెంచుతుంది.  నెయ్యి అలసట అనేది అంతర్లీన ఒమేగా-3 లోపం వల్ల ఏర్పడే సాధారణ లక్షణం, కాబట్టి నెయ్యి (ఒమేగా 3  గొప్ప మూలంగా నెయ్యిని పరిగణిస్తారు)ని   ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరానికి  కావలసిన శక్తి అందుతుంది. ప్రసవం అనంతరం పైన చెప్పుకున్నా ఆహారాలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగానూ, శారీరక, మానసిక స్థాయిలు సక్రమంగా నిర్వహించడంలోనూ సహాయపడుతాయి.                                       ◆నిశ్శబ్ద.

గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం గురించి షాకింగ్ నిజాలు!

గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం గురించి షాకింగ్ నిజాలు! ఈమధ్య కాలంలో మహిళలు గర్భము ధరించిన తరువాత మధుమేహ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ మధుమేహం గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందే ఒక రకమైన మధుమేహం. సాధారణంగా రెండవ లేదా మూడవ నెలలో శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఇది ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి మీద, దాని అది శరీరంలో ఎలా వినియోగం అవుతుంది అని దానిమీద ఆధారపడి ఉంటుంది.  ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. గర్భధారణ మధుమేహం ఉన్న స్త్రీలు ఆ సమయంలో ఇంకా ప్రసవ సమయంలో ప్రీక్లాంప్సియా వంటి సమస్యలను ఫేస్ చేసే ప్రమాదం ఉంది. ఇది అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలకు హాని కలిగించే పరిస్థితి.  అలాగే మధుమేహం ఉన్న గర్భవతులలో నెలలు నిండకనే ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  గర్భధారణ మధుమేహం శిశువు అధిక బరువుతో పుట్టడానికి దారితీస్తుంది. ఇది షోల్డర్ డిస్టోసియా (డెలివరీ సమయంలో శిశువు భుజం ఇరుక్కున్నప్పుడు) లేదా సిజేరియన్ డెలివరీ వంటి డెలివరీ సమస్యలకు దారితీయవచ్చు. ఈ సమస్య వల్ల పుట్టిన తర్వాత శిశువులో తక్కువ షుగర్ లెవల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మూర్ఛలు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. ప్రసవ తర్వాత స్త్రీలలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, దీనిని పూర్తిగా నిరోధించడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో వచ్చే  మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడానికి తినవలసిన ఆహారాలు: కార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు పచ్చని ఆకు కూరలు, బ్రోకలీ, క్యారెట్లు బెల్ పెప్పర్స్ వంటి ఇతర పిండి లేని కూరగాయలలో ఫైబర్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు శుద్ధి చేసిన ధాన్యాల నుండి బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలకు మారడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు శక్తిని, మంచి ఫైబర్ ను కలిగి ఉంటాయి.   ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, బీన్స్ మరియు చిక్కుళ్ళలో మంచి ప్రోటీన్ లభిస్తుంది.  పాల ఉత్పత్తులు పాలు, పెరుగు, చీజ్ వంటి తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్లకు మంచి మూలం. అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. పండ్లు పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి, కానీ వాటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు పండ్ల రసాలు లేదా ప్రాసెస్ చేసిన పండ్ల స్నాక్స్ కంటే తాజా పండ్లను ఎంచుకోవాలి, ప్రాసెస్ చేసిన వాటిలో  చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. గింజలు మరియు విత్తనాలు గింజలు, విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ లను కలిగి ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు ఇవి  మంచి స్నాక్ లా ఉపయోగపడతాయి. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు ఆహారంలో చేర్చుకోవడానికి కొన్ని మంచి ఎంపికలు.  ఆరోగ్యకరమైన కొవ్వులు అవోకాడో, ఆలివ్ నూనె వంటి వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో మరియు గర్భధారణ మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలకు కడుపు నిండుగా సంతృప్తిగా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి. గర్భధారణ మధుమేహానికి వ్యతిరేకంగా  మహిళలు నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ మధుమేహం అధిక ప్రమాదం ఉన్న మహిళలు,  కుటుంబంలో ఎవరికైనా మధుమేహం సమస్య ఉన్నవారు, గర్భధారణ సమయంలో రెగ్యులర్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా జాగ్రత్త పడచ్చు.                                   ◆నిశ్శబ్ద.

ముప్పై ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం!

ముప్పై ఏళ్ళు దాటిన మహిళలు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం! ప్రస్తుత కాలంలో 30 నుండి 40 ఏళ్ళ మహిళల్లో ఎక్కువగా ఎదురవుతున్న సమస్య ఎండోమెట్రియోసిస్. గర్భాశయం (ఎండోమెట్రియం) లోపలి భాగంలో ఉండే కణజాలం గర్భాశయం వెలుపల అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు, పెల్విస్‌లోని ఇతర భాగాలలో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది.  ఎండోమెట్రియోసిస్ కటి నొప్పి, నెలసరి ఎక్కువరోజులు కొనసాగడం, పిల్లలు కలగడంలో ఇబ్బంది వంటి అనేక లక్షణాలకు దారి తీస్తుంది. ఈ సమస్య ఎన్నో శారీరక, మానసిక సమస్యలు సృష్టించి, మహిళల లైఫ్ స్టైల్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది పునరుత్పత్తి, లైంగిక, వృత్తిపరమైన, సామాజిక పనితీరులను ప్రభావితం చేస్తుంది. మొదట్లోనే ఈ సమస్య గురించి తెలుసుకుంటే.. దీన్ని గుర్తిస్తే.. దీన్ని అధిగమించడం సులువు అవుతుంది.  ఎండోమెట్రియోసిస్ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా ఉంటే కణజాల పెరుగుదల, వాపుకు దారితీయవచ్చు, ఇది పరిస్థితిని మరింత బాధాకరంగా మారుస్తుంది. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎండోమెట్రియోసిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఎండోమెట్రియోసిస్‌ ఉన్న మహిళలు తీసుకోవలసిన ఆహారాలు ఏమిటంటే.. పసుపు పసుపులో ప్రధాన క్రియాశీల పదార్ధమైన కర్కుమిన్, ఎస్ట్రాడియోల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఎండోమెట్రియోసిస్‌ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది., అలాగే కర్కుమిన్ గర్భాశయం యొక్క లైనింగ్ కణజాల వ్యాప్తిని అణిచివేస్తుంది.  వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ అత్యంత ఆల్కలీన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఒకటి. క్లోరోఫిల్ సమృద్ధిగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి, వాపును తగ్గించడానికి, ప్రో-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల కార్యకలాపాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ క్లోరోఫిల్ వీట్ గ్రాస్ లో లభ్యమవుతుంది.  మునగ ఆకు.. మునగ ఆకు రసంలో మొరింగ ఒలిఫెరా ఉంటుంది. ఇది ఆండ్రోజెన్ గ్రాహకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎండోమెట్రియం యొక్క మందాన్ని కూడా తగ్గిస్తుంది. అశ్వగంధ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి అనుబంధంగా అశ్వగంధ ఉపయోగిస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది.   శతావరి శాతవరి ఎండోమెట్రియోసిస్ సంశ్లేషణలను తగ్గించడంలో సహాయపడే మాక్రోఫేజ్‌ల ఫాగోసైటిక్ చర్యను పెంచుతుంది. ఎండోమెట్రియోసిస్‌ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి చిట్కాలు: ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుకైన జీవనశైలిని నిర్వహించడం వలన నెలసరిలో తిమ్మిరి, ఉబ్బరం తగ్గించవచ్చు, ఇవి ఎండోమెట్రియోసిస్ సాధారణ లక్షణాలు. ఒత్తిడి ఎండోమెట్రియోసిస్ లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది, కాబట్టి దానిని నియంత్రించడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటి రిలాక్సేషన్ పద్ధతులు సహాయపడతాయి. ఎండోమెట్రియోసిస్ లక్షణాలను తగ్గించడంలో హార్మోన్ థెరపీ సహాయపడుతుంది. దీనివల్ల ఋతుచక్రాన్ని నియంత్రించవచ్చు. ఆక్యుపంక్చర్ లేదా హెర్బల్ రెమెడీస్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు ఎండోమెట్రియోసిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా ఈ సమస్యలో గైనకాలజిస్ట్ ను సంప్రదించడం చాలా ముఖ్యం.                                     ◆నిశ్శబ్ద.

గర్భవతులకు మలబద్దకం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి!

గర్భవతులకు మలబద్దకం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి! గర్భం ధరించిన స్త్రీల శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.  డెలివరీకి ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డెలివరీ తర్వాత అంతా నార్మల్‌గా అయిపోతుందని అనుకుంటారు కానీ చాలావరకు అది జరగదు.  చాలా మంది మహిళలకు బిడ్డ ప్రసవం తర్వాత కూడా పైల్స్ సమస్యలు అలాగే ఉంటాయి. . ప్రెగ్నెన్సీకి ముందు పైల్స్ సమస్య లేకపోయినా, ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే, మహిళలు గర్భధారణ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుని, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. అసలు పైల్స్ అంటే ఏంటి? మానవ శరీరంలో పురీషనాళం చుట్టూ సిరలు ఉంటాయి. ఈ సిరలు ఉబ్బుతాయి. అసాధారణమైన వాపు ఏర్పడుతుంది.  ఈ  సమస్య కారణంగా, ప్రేగు కదలిక సమయంలో దురద,  నొప్పి ఉంటుంది.  ఇవి బయటికి పొడుచుకు వచ్చిన చిన్న గింజలా ఉంటాయి. గర్భవతుల్లో ఎందుకొస్తుంది? నిజానికి, గర్భధారణ సమయంలో గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, సిరలు సులభంగా ఉబ్బుతాయి. అంతే కాకుండా ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల గర్భిణీ స్త్రీలో మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం సమయంలో, మలం చాలా గట్టిగా మారుతుంది. ఈ కారణంగా పైల్స్ పరిస్థితి తీవ్రంగా మారుతుంది. సరళంగా చెప్పాలంటే, గర్భిణీ స్త్రీలు మలబద్ధకం కారణంగా పైల్స్‌కు గురవుతారు. డెలివరీ సమయంలో అధిక ఒత్తిడి కారణంగా హేమోరాయిడ్లు సంభవించవచ్చు. పైల్స్ సమస్యను ముందే గుర్తుపట్టడం ఎలా? పైల్స్ వ్యాధిలో, మలద్వారంలో నొప్పి, మంట, దురద ఉంటుంది. ప్రేగు కదలిక సమయంలో నొప్పి పెరుగుతుంది. కూర్చున్నప్పుడు కూడా పైల్స్ కారణంగా నొప్పి ఉంటుంది. పైల్స్ కారణంగా, మల విసర్జన తర్వాత కూడా ఇబ్బందిగానే ఉంటుంది.  పురీషనాళం సమీపంలోని కణజాలంలో వాపు, పుండ్లు, రక్తస్రావం కనబడతాయి. పైల్స్ తగ్గడానికి, రాకుండా ఉండటానికి గర్భవతులు ఏమి చేయాలంటే..  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడే మహిళలు తమ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. దీని కోసం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇది పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలవిసర్జన ఆపకూడదు.. గర్భవతులు బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపించినప్పుడు, వెంటనే టాయిలెట్‌కు వెళ్లిపోవాలి. కారణాలు చెప్పుకుని మెలాన్ని బిగపట్టుకుని కాలం వెళ్లబుచ్చకూడదు. ఇలా చేస్తే కడుపు అస్తవ్యస్తం అవుతుంది. పేగులు ఎప్పటికపుడు శుద్ధి అవుతుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు.   శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి గర్భిణీ స్త్రీలు తమను తాము హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని కోసం నీరు బాగా త్రాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి ద్రవాలను తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల పైల్స్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.                                      ◆నిశ్శబ్ద.

మహిళల్లో జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్య ఉన్నట్టో తెలుసా?

మహిళల్లో జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్య ఉన్నట్టో తెలుసా? ఇప్పటి కాలంలో మహిళల ఆరోగ్యం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. నెలసరి సమస్యల నుండి ఎన్నో రకాల జబ్బులు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ మహిళలను బలహీనంగా మారుస్తాయి. కొన్ని సార్లు తాము అనారోగ్యంతో ఉన్నామనే విషయం కూడా మహిళలు స్వతహాగా గుర్తించలేరు. చాలా చిన్నవే.. అనే నిర్లక్ష్యంతో కొన్ని దాటవేస్తుంటారు. చాలామంది వైద్యులు మహిళలు ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుని, అన్ని రకాల పరీక్షలు చేయించడం ఉత్తమం అని అంటుంటారు. కానీ అందరికీ ఆర్థిక పరిస్థితులు సరిపడినట్టు ఉండవు. చాలామంది జుట్టు,  చేతి గోర్ల కండిషన్ ను బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చో చెప్పచ్చంటున్నారు. ముఖ్యంగా జుట్టు కండిషన్ ఎలా ఉంది?? ఎంత మొత్తంలో రాలిపోతోంది అనే దాన్ని బట్టి ఏ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చో గెస్ చేయవచ్చట. ఇంతకూ జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్యలు ఉన్నట్టో తెలుసుకుంటే.. జుట్టు రాలడం.. ఇది చాలా సాధారణ సమస్య. సాధారణంగా తల స్నానం తరువాత   100 వెంట్రుకల వరకు రాలిపోతుంది, ఈ నష్టం తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం. పోషకాహార లోపాలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి.  ఈ క్రమంలో వైద్యుడిని సంప్రదిస్తే థైరాయిడ్, రక్తహీనతతో పాటు విటమిన్ డి లోపంతో సహా కొన్ని విటమిన్, ఖనిజ లోపాలను గుర్తించే పరీక్షలు చేయవచ్చు.. పెళుసుదనం … జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..  కొంత తేమ అవసరం. ముఖ్యంగా పెళుసుగా ఉండే జుట్టు  జింక్ మరియు, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. జింక్ ఐరన్ లేకపోవడం జుట్టు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కెరాటిన్ ఏర్పడటానికి ఈ పోషకాలు అవసరం. ఐరన్, జింక్ ను ఆహారం నుండి అయినా లేదా సప్లిమెంట్స్ ద్వారా అయినా సరిపడినంత తీసుకోవడం మంచిది.   బూడిద జుట్టు దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల DNA దెబ్బతింటుంది. ఇది  వెంట్రుకల కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. జుట్టు రాలడం అనే సమస్య ఒత్తిడి వల్ల కూడా సంభవిస్తుంది. అయితే జుట్టు నెరవడం జన్యువుల వల్ల కూడా సంభవిస్తుంది. చాలామందిలో ఇది వంశపరంపర్యంగా వస్తూంటుంది. జుట్టు పొడిబారడం  ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు మృదువుగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్య కరమైన కొవ్వులు లోపిస్తే..  జుట్టంతా పొడిబారిపోయి పీచులాగా కనిపిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు లోపిస్తున్నాయనే దానికి ఇది చక్కని సూచన. ఆహారంలో అవకాడో, ఆలివ్ ఆయిల్ సాల్మన్ ఫిష్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిచవచ్చు.   చుండ్రు చుండ్రు జుట్టులో పొట్టు పొట్టుగా ఏర్పడే ఒకానొక సమస్య. ఇది పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. చుండ్రు సరైన విధంగా ప్రయత్నం చేస్తే తొందరగానే తగ్గిపోతుంది. సెబోర్హెయిక్ డెర్మటైటిస్ ఎరుపు, జిడ్డుగల చర్మంతో ఉంటుంది, ఇది తెల్లటి లేదా పసుపు రంగు పొలుసులతో కప్పబడి ఉంటుంది. మలాసెజియా, ఈస్ట్ లాంటి శిలీంధ్రం జుట్టు కుదుళ్లలో ఏర్పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. జుట్టు పొడిబారడం ఈ సమస్యకు కారణం కావచ్చు.   ఈ విధంగా జుట్టు కండిషన్ ను బట్టి శరీర స్థితిని కూడా తెలుసుకోవచ్చు.                                  ◆నిశ్శబ్ద.

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా...

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా... చాలామంది మహిళలలో తరచుగా వినిపించే ఫిర్యాదు నడుమునొప్పి. నడుమునొప్పి అనేది ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వాచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా నడుమునొప్పి వచ్చేస్తోంది. నడుమునొప్పి నివారణ కోసం ఎన్నో రకాల మందులు, పెయిన్ రిలీఫ్ జెల్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకుంటే దీన్ని నివరించుకోవడం అందరి చేతుల్లోనే ఉంది. మరి నడుము నొప్పి ఎలా వస్తుంది దానికి కారణం ఏమిటి వంటి వివరాలు తెలుసుకుంటే… నడుమునొప్పి ఎలా వస్తుంది?? ఎందుకు వస్తుంది?? నడుము  అనేది శరీరానికి మధ్యభాగంలో ఉన్న అవయవం. కడుపు పై భాగం నుండి ఉన్న బరువు మొత్తం నడుము మీద పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు లేదా సాధారణంగా అలవాటు ప్రకారము వంగినప్పుడు నడుము భాగం వంచుతూ ఉంటాం. ఫలితంగా నడుము భాగం ప్రభావానికి గురవుతుంది. నడుము వంచిన భంగిమ లేదా నడుము మీద బరువు పడే ప్రాంతాన్ని బట్టి నడుము ప్రాంతం ఒత్తిడికి లోనయ్యి నొప్పి వస్తుంది. ఒకే వైపు బరువు పడటం, ఒకే వైపు వంగి కూర్చోవడం, ఒకే వైపు బరువులు ఎత్తడం, నడవడంలో కూడా ఒకేవైపు బెండ్ కావడం వంటివి జరిగినప్పుడు నడుము ప్రభావానికి గురయ్యి నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వచ్చే కొన్ని కారణాల, వాటి నివారణకు మార్గాలు ఉన్నాయి… కూర్చునేటప్పుడు:- కూర్చునేటప్పుడు   వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల శరీరం సమాంతరంగా ఉండి బరువు ఒకే ప్రాంతంలో పడకుండా ఉంటుంది. నడుము నొప్పి రాకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా వీలైనంతవరకు ఇలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే నడుమునొప్పి తగ్గిపోతుంది.  చాలామంది బరువులు ఎత్తుతూ ఉన్నపుడు కాళ్ళను నిటారుగా ఉంచుతారు. ఇలా ఎత్తేటప్పుడు నడుము మీద చాలా ఒత్తిడి పడుతుంది. నడుము భాగంలో కండరాలు, ఎముకలు బిగుసుకున్నట్టు అవుతాయి. అయితే ఇలా బరువు ఎత్తేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కాస్త తప్పిన అది నడుము మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.   కాబట్టి బరువులు ఎత్తేటపుడు కాళ్ళను 'మోకాళ్ళవద్ద వంచి, బరువులు ఎత్తాలి.  ఇకపోతే నిలబడినప్పుడు కూడా పద్దతిగా నిలబడాలి. కొండస్రు నిలబడినప్పుడు బరువు మొత్తం ఒక కాలు మీద వేసి నిలబడటం, లేదా ఒకవైపుకు వంగి నడుము ఒకవైపు భాగం మీద బరువు వేయడం, ఒకవైపు మాత్రమే నడుము వంచి ఎక్కువ సేపు ఉండటం వంటివి చేస్తుంటారు. దీనివల్ల నడుమునొప్పి చాలా తొందశరగా వస్తుంది. కాబట్టి నిలబడినట్టు అటు ఇటు బెండ్ అవ్వకుండా నిటారుగా నిలబాడ్స్ట్స్మ్ ఎంతో ముఖ్యం. పడుకునే సమయంలో కూడా భంగిమ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవడం లేదా పడుకున్న తీరు ఏదైనా శరీరం అస్తవ్యస్తంగా కాకుండా కాస్త నిటారుగా ఉండటం ముఖ్యం. లేకపోతే శరీరం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిద్రపోతే నడుము భాగంలో కండరాలు పట్టేస్తాయి.  పొట్ట కింద భాగంలో ఉండే అబ్డామినల్ కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎలాగంటే అలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు నడుము నొప్పి రాకూడదు అంటే ఒక మంచి చిట్కా ఉంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే పడుకునే విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా నడుము ఒత్తిడికి గురి కాదు. కుర్చీలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. అంతే కానీ ఒకవైపుకు అనుకుని మూలకు కూర్చోకూడదు. అలాగే కుర్చీ నుండి లేచేతప్పుడు ఒకేసారి పైకి లేవకుండా  ఒక కాలిని ముందుకు, మరొక కాలిని వెనక్కు పెట్టి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నడుమునొప్పి రాదు.  ఆడవారిలో ఈమధ్య బాగా విస్తృతం అయిపోయిన అలవాటు హై హీల్స్ వేసుకోవడం. ఇలా హైహీల్స్ వేసుకొంటే నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  చాలామంది  ఆడవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు రెండు కాళ్ళను ఇంటూ ఆకారంలో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. పైన చెప్పుకున్న కొన్ని చిట్కాలు గమనిస్తే మహిళలు తమకు తెలియకుండా నడుము నొప్పిన బారిన ఎలా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటికి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పికి చెప్పచ్చు బై బై..                                      ◆నిశ్శబ్ద.

బరువు పెరుగుతున్నామని భయం వద్దు.. ఇలా చేస్తే చాలు!

బరువు పెరుగుతున్నామని భయం వద్దు.. ఇలా చేస్తే చాలు! మనం భోజనం చేయడం సహజం. అయితే చాలా మంది మహిళలు తిన్న కొద్ది సేపటికే ఆకలి అంటూ ఉంటారు. ఇలా  అనిపించడం సర్వసాధారణం, కానీ అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల  ఆరోగ్యానికి హాని కలుగుతుంది.  శరీరం  ఆకలి సంకేతాలను వినడం ముఖ్యం అయినప్పటికీ,   సరైన ఆహారాన్ని ఎంచుకోవడం  చాలా అవసరం. అనారోగ్యకరమైన తిండిని నివారించడానికి,  మంచి ఆహారం  ఎంపిక చేసుకోోడానికి గందరగోళ పడుతున్నట్టైతే  ఈ చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వండి..  ఆహారం ట్రాక్‌లో ఉండేలా చేసుకోవడం ఇలా.... ముందుగా ప్లాన్ చేసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపికంచేసుకోవాలి. లేకుపితే చాలా ఈజీగా  దగ్గరలో ఉన్న జంక్ ఫుడ్ వైపుకు వెళ్ళిపోతారు. తీసుకునే ఏ ఆహారం అయినా స్నాక్స్ తో సహా ముందే ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల  ఎప్పుడూ పోషకమైన ఆహారం మీరు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. తాజా పండ్లు కూరగాయలను తీసుకోవాలి. ఎనర్జీ బార్ లు స్నాక్ లో చేర్చుకోవాలి.  ఆకలితో ఉన్నప్పుడు ఇవి మంచి ఆప్షన్. ఆరోగ్యం కూడా..   ఇంటి ఆహారమే.. మహాభాగ్యం.. బయట కొన్న ఆహారంలో జోడించిన చక్కెర, అనారోగ్య కొవ్వులతో నిండి ఉంటాయి. అందుకే, పూర్తి పోషక పదార్ధాలను ఉపయోగించి ఇంట్లో స్వంతగా తయారు చేయడానికి ప్రయత్నించాలి.  హైడ్రేటెడ్ గా ఉండాలి.. ఎవ్వరికీ ఎక్కువగా తెలియని షాకింగ్ నిజం ఏమిటంటే.. శరీరంలో తేమ శాతం తక్కువైతే చాలా మందికి దాన్ని ఆకలి అనుకుంటారు. చాలాసార్లు ఆకలి అనిపించి ఆహారం తీసుకున్నా తృప్తి కలగకపోవడానికి కారణం ఇదే.. నదుకే నీటిని సరిపడినంత తీసుకోవాలి.  ఆకలి అనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి ఆ తరువాత కూడా అదే విధంగా ఆకలి అనిపిస్తే అపుడు ఆహారం తినాలి. అల్పాహారం చేసేటప్పుడు జాగ్రత్త  మైండ్‌ఫుల్ ఈటింగ్.. ఫాలో అవ్వాలి. అంటే మీరు తినే వాటిపై శ్రద్ధ చూపడం ప్రతి బైట్ ను  ఆస్వాదించడం. అల్పాహారం చేసేటప్పుడు, టీవీ, మొబైల్ ఫోన్‌లు, సోషల్ మీడియా చూడటం వంటివి నివారించండి. ఆహారం రుచి, అందులో పదార్థాలు దాని వాసన ఇలాంటివి అనుభూతి చెందుతూ తింటే చాలా తొందరగా తృప్తి చెందిన ఫీల్ కలుగుతుంది.  ఆప్షన్స్ కూడా.. ఆహారం తీసుకునేటప్పుడు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి,  ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బ్లడ్ షుగర్ స్పైక్‌లు, క్రాష్‌లకు కారణమయ్యే అవకాశం తక్కువ. వీటిని ఫాలో అయితే మహిళల్లో బరువు పెరగడం అనే సమస్య ఉండదు..                                                ◆నిశ్శబ్ద.

మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!

మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!  ఇప్పటికాలంలో అమ్మాయిలు జుట్టు రాలడమనే సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన కారణాన్ని తెలుసుకోకుండా కనిపించిన మార్గమల్లా ఫాలో అవ్వడంతో కేవలం జుట్టు రాలే సమస్య కాస్తా జుట్టు పలుచగా, సున్నితంగా మారిపోవడానికి, జీవం కోల్పోవడానికి కారణం అవుతుంది. అయితే దీనికి అసలు కారణం.. కారణానికి తగిన పరిష్కారం తెలుసుకుంటే.. శరీరంలో కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. రోజురోజుకూ తమ జుట్టు పల్చబడి పొడిబారడంతోపాటు చిట్లిపోతుందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారాలను వెతుక్కుంటూ చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కొన్నిసార్లు, శరీరంలో ఇదొక్కటి తగినంత మొత్తంలో లేకపోవడం వల్ల జుట్టురాలిపోవడం జరుగుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండి శరీరంలో వివిధ రకాల విధులను సజావుగా నిర్వహించడం వరకు సహాయపడేది ఇదే.. ఇంత ప్రముఖ పాత్ర పోషించే పదార్థమే ఒమేగా-3 ఫ్యాట్స్..   జుట్టు రాలే సమస్య బాగా  ఎదుర్కొంటుంటే లేదా మీ జుట్టు పలుచబడటం లేదా పొడిగా,  పెళుసుగా ఉన్నట్లు అనిపిస్తే, ఒమేగా-3 తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే.. ఒమేగా-3 కొవ్వులు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, అవి  జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. జుట్టు చక్కగా.. అందంగా, మందంగా లేకపోతే  ఒమేగా-3 శరీరానికి తగిన మోదాదులో అందడం లేదని అర్థం. ఇలాంటి  పరిస్థితిలో  తప్పనిసరిగా తినవలసిన ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచించారు.  నెయ్యి, ఆలివ్ నూనె, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు,  చియా విత్తనాలు ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొత్తం జుట్టు నాణ్యతను పెంచుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, మీ జుట్టుకు మంచి చేసే ఇతర ఆహారాలు.. గుడ్లు, బచ్చలికూర,  గింజలు, నల్ల శనగలు,  అవకాడోలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మొదలయినవి.                                                                                                              ◆ నిశ్శబ్ద

ఆడవారి దారుణమైన నెలసరి వెనుక షాకింగ్ సమస్య ఇదే!

ఆడవారి దారుణమైన నెలసరి వెనుక షాకింగ్ సమస్య ఇదే! ఎండోమెట్రియోసిస్ అనేది  గర్భాశయ కుహరం వెలుపల  గర్భాశయ  లైనింగ్ కణజాలం పెరిగే ఒక సమస్య. గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. ఈ పొరమీద కణజాలం పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటున్నారు.  దీని ప్రభావం కారణంగా దీన్ని ఒక జబ్బుగా పరిగణిస్తున్నారు.   అండాశయాలు, ప్రేగులు కటి మొదలైన భాగాల్లో ఎండోమెట్రియల్ కణజాలం పెరిగినప్పుడు ఎండోమెట్రియోసిస్ వస్తుంది. కణజాలం పెల్విక్ ప్రాంతం దాటి వ్యాప్తి చెందడం చాలా అరుదుగా జరుగుతుంది. గర్భాశయం వెలుపల పెరుగుతున్న ఎండోమెట్రియల్ కణజాలాన్ని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్ అంటారు. ఎండోమెట్రియోసిస్ ప్రతి స్త్రీని వేర్వేరుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనికి ఒక ప్రామాణికమైన చికిత్స లేదు. కొన్ని జీవనశైలి సర్దుబాట్లు, ఇంటి నివారణలు, చికిత్సా వ్యూహాలు, ఇంకా ప్రిస్క్రిప్షన్ మందులు ఈ సమస్య నుండి ఊరటను ఇస్తాయి.   ఎండోమెట్రియోసిస్ సమస్య  గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది. ఇలాంటి సమయంలో వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. సంతానోత్పత్తి చికిత్సలో అండాశయాలను ప్రేరేపించడం నుండి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వరకు అన్ని ఉంటాయి . ఎండోమెట్రియోసిస్ శారీరకంగా మానసికంగా ఎదుర్కోవడం చాలా కష్టమైన అనారోగ్యం గా పేర్కొనవచ్చు. కానీ దీన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  పోషణపై నిఘా ఉంచాలి.. సరైన భోజనం తీసుకోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ నుండి రక్షణ పొందవచ్చు. మంట, ప్రోస్టాగ్లాండిన్ జీవక్రియ, ఈస్ట్రోజెన్ స్థాయిలు ఈ సమస్యపై ప్రభావితం చూపిస్తాయి. ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండటం, అలాగే తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా రసాయనాలు కాకుండా సేంద్రీయంగా ఉత్పత్తి చేసినవి తీసుకోవడం మంచిది. రసాయనాలు ఎక్కువ ఉన్న ఆహారం  ఎండోమెట్రియోసిస్‌ కు కారణం అవుతుంది.  హీటింగ్ ప్యాడ్‌ ఇలా ఉండాలి.. నెలసరి సమస్యల్లో అధికంగా ఋతు రక్తం పోవడం, పొత్తి కడుపు నొప్పి, కటి భాగంలో నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి పరిష్కారంగా హీటింగ్ ప్యాడ్ వాడుతుంటారు చాలామంది. అయితే ఇది ఎలక్ట్రానిక్ తరహా హీటింగ్ ప్యాడ్ కాకపోతే మంచిది. ఆరోగ్య వంతమైన హీటింగ్ ప్యాడ్ పొత్తికడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు తగ్గించడంలో సహాయపడుతుంది.  సహజమైనవి తీసుకోవాలి.. పశుగ్రాసంలో ఉండే కొన్ని పురుగుమందులు  డయాక్సిన్ అనే టాక్సిన్ ను కలిగి ఉంటాయి. ఇవి  ఎండోమెట్రియోసిస్‌ రావడానికి కారణం అవుతాయి.  మాంసాహారం వినియోగాన్ని తగ్గించడం ద్వారా వీలైనంత వరకు తక్కువ గ్లూటెన్, సేంద్రీయ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. అదే రసాయనాలు ఉన్న ఆహారం తీసుకుంటే అది హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తుంది.  శస్త్రచికిత్స.. గర్భం దాల్చకూడదనుకునే మహిళల్లో ఏకంగా , గర్భాశయం యొక్క తొలగింపు వరకు ఈ సమస్య వెళ్తుంది. అధిక నెలసరి ప్రవాహం,గర్భాశయ తిమ్మిరి కారణంగా బాధాకరమైన ఋతుస్రావం జరుగుతుంది . ఇలాటి సమయాల్లో చాలామంది ఇక గర్భాశయమే వద్దనుకునే స్థితిలోకి జారుకుంటారు. 35ఏళ్ల లోపు ఈ సమస్య ఎదురైతే  ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ డి, విటమిన్ బి విటమిన్లను కచ్చితంగా తీసుకోవాలి.. విటమిన్ డి ని "హ్యాపీ విటమిన్" అని పిలుస్తారు, ఇది ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. ఎండోమెట్రియోసిస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో విటమిన్ B శక్తిని పెంచుతుంది. ఆహారంలో కొవ్వు ఎండోమెట్రియోసిస్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, అత్యధికంగా ట్రాన్స్ ఫ్యాట్‌లను తిన్నవారిలో ఎండోమెట్రియోసిస్ వచ్చే ప్రమాదం 48% పెరిగింది. ఒమేగా-3 నూనెలు ఎక్కువగా తీసుకునేవారు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే ఎండోమెట్రియోసిస్ ప్రమాదాన్ని 22% తగ్గించారు. సాల్మన్, అవిసె గింజలు వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉన్న  ఫుడ్స్ తీసుకోవడం ఎండోమెట్రియోసిస్‌ తగ్గించడంలో ఉపయోగపడతాయి.                                           ◆నిశ్శబ్ద.

పండంటి బిడ్డ పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తప్పక తీసుకోవాలి!

పండంటి బిడ్డ పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తప్పక తీసుకోవాలి! స్త్రీలు సాధారణ సమయాల్లో తీసుకునే జాగ్రత్తల కంటే.. వారు గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం కోసం, గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం, గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఆహారం గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆ ఆహారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో, గర్భిణీ స్త్రీ ఆహారం ద్వారా డెలివరీ సమయంలో సంభవించే సమస్యలను కూడా నివారించవచ్చు. గర్భధారణ సమయంలో స్త్రీ ఏది తింటే అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలకు పూర్తి పోషకాహారం లభిస్తే, ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో స్త్రీ తప్పనిసరిగా కొన్ని పదార్థాలు తినాలి. గర్భిణీ స్త్రీకి, పుట్టబోయే బిడ్డకు మేలు చేసే ప్రెగ్నెన్సీ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు ఏమి తినాలంటే…  పాలకూర పచ్చి కూరగాయలలో అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో పాలకూర తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాలకూరలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు అనేక ఖనిజాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధికి, మెరుగైన ఆరోగ్యానికి బచ్చలికూర తీసుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలు పాలకూర తీసుకోవడం వల్ల  పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం, తీక్షణమైన బుద్ధి లభిస్తాయి. గుడ్డు గుడ్డు కూడా పోషకాలతో నిండి ఉంది. గుడ్డులో ప్రొటీన్లతో పాటు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. శిశువు మెదడు అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. అందుకే గర్భిణీ స్త్రీలు గుడ్లు తినాలి. బాదం బాదంలో చాలా పోషకాలు ఉన్నాయి. బాదంపప్పు తింటే గుండె ఆరోగ్యం  పదునవుతుంది.  ఇది గర్భిణీ స్త్రీలకు వారి పిల్లలకు కూడా మంచిది. బాదంపప్పులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. గర్భధారణ సమయంలో స్త్రీలు బాదంపప్పును తీసుకోవాలి. ఇది పిల్లల మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. తాజా పండ్లు తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాజా పండ్ల నుండి విటమిన్లు లభిస్తాయి. స్త్రీ గర్భధారణ సమయంలో నారింజ, అరటి, మామిడి, ద్రాక్ష, యాపిల్ మొదలైన పండ్లను తీసుకోవాలి. కావాలంటే ఫ్రూట్ జ్యూస్ చేసి తాగొచ్చు. పెరుగు గర్భిణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం వల్ల బిడ్డకు ఆరోగ్యకరం. ఇది చాలా మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ సి సహా చాలా ప్రోటీన్లు ఉంటాయి. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత ఆరోగ్యవంతమైన మరియు అభివృద్ధి చెందిన బిడ్డ పుడుతుంది. పాలు పిల్లలైనా, పెద్దలైనా, ప్రతి ఒక్కరూ పాలు తీసుకోవాలని సూచిస్తారు. ఒక గ్లాసు పాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీకి కఫుపులో బిడ్డకు పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీంతో శరీరానికి బలం చేకూరుతుంది. ఆరోగ్యం ఏర్పడుతుంది.  అందరికీ అందుబాటులో ఉండే ఈ పదార్థాలు తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యం.                                  ◆నిశ్శబ్ద.

మీ ఆరోగ్యానికి అద్భుత మంత్రం!

మీ ఆరోగ్యానికి అద్భుత మంత్రం! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఒంట్లో బాగోలేకున్నా, మనసు భారంగా ఉన్నా అన్నీ భరిస్తూ ఇంటి పని, బయటి పనులు చక్కబెట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకొచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. మగవారు బయటికెళ్లి ఉద్యోగం చేసొస్తే వారికి అన్ని సేవలు చేస్తూ, పిల్లలను, అత్తమామలను చూసుకుంటూ తమ గురించి తాము మరచిపోతారు మహిళలు. ఈ కారణంగా మహిళలు శారీరకంగా బలహీనం అవుతారు. ఇక సంపాదన పరంగా మగవారు ఆడవారిని చాలా తొందరగా మాటలు అనేస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా కుటుంబంలో జరిగే ఎన్నో గొడవలకు మూల కారణంగా మహిళలనే చేస్తుంటారు. బయట ఎన్ని గొడవలు, ఒత్తిడులు ఉన్నా అవన్నీ ఇంటికొచ్చి మహిళల మీద చూపంచే భర్తలు, తండ్రులు, అన్నలు, ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్టు.. సాటి ఆడవారే చులకనగా చూసి, అవమానిస్తుంటారు. ఈ కారణాల వల్ల మహిళలు మానసికంగా బలహీనం అయిపోతుంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఎంతో దృఢంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం మహిళలు చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. ఇవి అద్భుత మంత్రాలనే చెప్పొచ్చు.. మీకోసం.. మీరు.. కుటుంబం, భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా ఎందరున్నా ప్రతి మహిళ తన ప్రాధాన్యతను తాను గుర్తుంచుకోవాలి. మొదట తన గురించి తాను జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి. తన సంతోషాన్ని, తన సమయాన్ని తాను ప్రత్యేకంగా గడపగలగాలి. భారతీయ మహిళకు ఇలాంటి పని కాస్త కష్టమే.. కానీ అసాధ్యం కాదు. కుటుంబానికి కావలసినవన్ని ఓ మహిళ ఇస్తున్నప్పుడు, ఆ మహిళల తనకు కావలసింది తాను తీసుకోవడంలో తప్పు లేదుగా.. ఇలా చేస్తే మహిళలు మానసికంగా బలవంతులు అవుతారు. ఆరోగ్యం.. మీ బాధ్యత… మీ ఆరోగ్యం గురించి భర్త, పిల్లలు పట్టించుకుని వారు మిమ్మల్ని  డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తేనే వెళ్లే వర్గానికి చెందినవారు మీరైతే.. ఇప్పుడే మీ పద్ధతి మార్చేసుకోండి. సహజంగా మహిళలకు ప్రతి దశలో ఎన్నో ఆరోగ్యం సమస్యలు వస్తుంటాయి. ఏ పెయిన్ కిల్లరో.. మరే సిరప్పో.. వేసుకుని అప్పటికి సమస్య తగ్గిపోయిందనిపించుకుని ఏళ్లకేళ్ళు గడిపేసే మహిళా మణులు చాలామందే ఉన్నారు. అవన్నీ వదిలి శరీరం సౌకర్యంగా అనిపించకపోయినా, ఏదైనా ఇబ్బంది తలెత్తిన చక్కగా వైద్యులను సంప్రదించాలి.  ప్రతి మహిళా కాల్షియం, ప్రోటీన్, విటమిన్, బోన్ స్ట్రేంగ్త్ పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేయించుకోవాలి. పోషకారం మీకే ముఖ్యం.. మీగడ పెరుగాంతా భర్తకూ, పిల్లలకూ వడ్డించి తనకు మాత్రం నీళ్లు కలిపి పలుచని మజ్జిగతో భోజనాన్ని మ్యా.. మ్యా.. అనిపించే మహిళలు బోలెడు ఉన్నారు. మగవాళ్ళు ఎక్కువ తినాలి అనే మాటతోనో.. ఎదిగే పిల్లలకు పెట్టాలి కదా అనే సమర్థింపుతోనో ఇంటివారికి ఎక్కువ పెట్టడంలో తప్పు లేదు.. అది వారి మీద ఇల్లాలికి ఉన్న ప్రేమ. కానీ.. ఆడవారికే ఆహారం అవసరమే కదా.. ఉదయం లేచి ఇల్లు ఊడవడంతో మొదలుపెట్టే పనికి రాత్రి భోజనాలు అయ్యాక తిన్నవి కడిగి సర్దిపెట్టే వరకు విరామం అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో భర్త, పిల్లలకు పెట్టే దానికంటే ఎక్కువగా, మంచి పోషకాహారం ఆడవారికే అవసరం. యోగా.. ధ్యానం...కావాలి.. యోగా.. ధ్యానం మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. యోగ లోని ఆసనాల వల్ల  మహిళల శరీరంలో వివిధ అవయవాల పనితీరు మెరుగవుతుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి, శరీరంలో అదనపు కొవ్వు, దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గర్భాశయం, థైరాయిడ్, హార్మోన్స్ అసమతుల్యత వంటివి ఆమడ దూరం పోతాయి. ధ్యానం వల్ల చక్కని ఏకాగ్రత, దృఢ నిర్ణయం తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది. మానసిక ఒత్తిడులు అధిగమిస్తారు. నెలసరి సమయంలోనూ, గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం, భర్తతో అనుబంధం, మెనోపాజ్ దశ ఇలా అన్ని సమయాలలో ఒత్తిడి సహజంగా ఉంటుంది మహిళల్లో. ఈ ఒత్తిడిని డీల్ చేయడానికి ధ్యానం బాగా సహకరిస్తుంది. గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకునే మహిళల్లో అస్తిత్వం మెరుగ్గా ఉంటుంది. ప్రతి మహిళా కుటుంబాన్ని, గృహిణి బాద్యతనూ కలిగి ఉంటారు. అయితే వాటితో పాటు ప్రపంచాన్ని కూడా శాసించగలిగేవారు కొందరే ఉంటారు. ప్రతి మహిళా ప్రపంచాన్ని శాసించక పోయినా.. తన ప్రపంచాన్ని తాను శాసించుకోగలిగే శక్తిమంతురాలు కావాలి. తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలి.  అప్పుడే మహిళా దినోత్సవ అర్థానికి సార్ధకత చేకూరుతుంది.                                    ◆నిశ్శబ్ద .

గర్భనిరోధక మాత్రలు మిమ్మల్ని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోండి!

గర్భనిరోధక మాత్రలు మిమ్మల్ని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోండి! ఈ సృష్టిలో ఒక ఆడపిల్ల గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మను ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందు నచ్చిన వ్యక్తితో కలవడం, పెళ్లి తరువాత కూడా ఇంకా కెరీర్ ప్లానింగ్ పేరుతో ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసం ఎక్కువ మంది ఆధారపడే మార్గం బర్త్ కంట్రోల్ పిల్స్ (birth controal pills) ఉపయోగించడం.  అయితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి కేవలం గర్భాన్ని రాకుండా చేస్తాయేమో కానీ అనేక సమస్యలను మాత్రం పక్కాగా వెంటబెట్టుకొస్తాయి. అండోత్సర్గాన్ని నిరోధించడానికి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మిశ్రమాన్ని కలిగి ఉన్న చాలా గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నెలవారీ మహిళల్లో వచ్చే నెలసరి సమయంలో అండాలు విడుదల అవుతాయి. వీటిని ఫలదీకరణం చెందించకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఉన్న మిశ్రమాలు ఆపుతాయి.  ఇవి ఎలా పని చేస్తాయంటే.. ఈ పిల్స్ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మాన్ని చిక్కగా చేయడం ద్వారా  పనిచేస్తుంది, స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశించడం, విడుదలైన అండాలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది.  పిల్‌ లోని హార్మోన్లు అప్పుడప్పుడు ఈ  గర్భాశయ లైనింగ్‌ను మార్చగలవు, గర్భాశయ గోడలను అంటిపెట్టుకుని ఉండే అండాలను విచ్చిన్నం అయ్యేలా చేస్తాయి. గర్భధారణను నిరోధించడానికి మాత్రమే ఈ బర్త్ కొంట్రోల్ పిల్స్ ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటారు.  ఇతర  జనన నియంత్రణ మార్గాల కంటే ఇది బాగా సక్సెస్ మార్గమైనప్పటికీ దీని వల్ల కలిగే మార్పులు మాత్రం కేవలం గర్భం రాకుండా అపడంతో అయిపోవు. ఇలాంటి టాబ్లెట్స్ వాడిన తరువాత  నెలసరిలో ఎక్కువ ఋతుస్రావం, నెలసరి క్రమం తప్పడం, ఎండోమెట్రియోసిస్, అడెనోమియోసిస్, హిర్సూటిజం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు చాప కింద నీరులా చేరతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అందరికీ ఒకే విషయమై పలితాన్ని ఇవ్వవు. ఒక్కొక్కరిలో ఒకో విధమైన ఎఫెక్ట్ ఉంటుంది. చాలామందిలో ఇవి వాడిన తరువాత గర్భధారణ సామర్థ్యము తగ్గిపోతుంది.    అమ్మతనం అనేది ఓ ప్రాణికి జీవితాన్ని ఇవ్వడం. స్వార్థ ప్రయోజనాలకోసం ఎంతో మంది మహిళలు అనుసరిస్తున్న ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా తరువాత అమ్మ అయ్యే అవకాశానికి వారే పెద్ద సమస్యను ఉత్పన్నం చేసుకుంటున్నారు. ఒకవేళ గర్భనిరోధక మార్గం అనుసరించాలని అనుకుంటే మగవారు కండోమ్ వాడటం ఆడ, మగ ఇద్దరికీ ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలోచించండి మరి..                                    ◆నిశ్శబ్ద.

కాబోయే అమ్మలకు వ్యాయామం ముఖ్యమా?

కాబోయే అమ్మలకు వ్యాయామం ముఖ్యమా? వ్యాయామం అనేది మనిషి తప్పకుండా ప్రతిరోజూ తన దినచర్యలో భాగం చేసుకోవాలి. అయితే వ్యాయామం విషయంలో ఒక్కొక్క పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక్కో విధమైన నిబంధనలు ఉంటాయి. గర్భం ధరించిన మహిళలు వ్యాయామం చేయవచ్చా.. చేస్తే ఇప్పుడు చెయ్యాలి?? ఎన్ని నెలల సమయంలో మొదలుపెట్టాలి?? ప్రారంభంలోనే వ్యాయామం చేయవచ్చా వంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి.  వ్యాయామం గర్భవతులు కూడా చేయవచ్చు. అయితే గర్భం గురించి తెలిసిన వెంటనే వ్యాయామం మొదలుపెట్టడం ప్రమాదం. గర్భం నిలవాలి అంటే 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవడం, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి 3 నెలల సమయంలో వ్యాయామం జోలికి వెళ్లకూడదు. ఆ తరువాత అంటే 3 నెలల తరువాత వ్యాయామం చేయడం మొదలుపెట్టవచ్చు. నెలలు నిండేకొద్ది మహిళ బరువు, శారీరక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యవంతంగా, బిడ్డకు సరైన విధంగా ప్రాణవాయువు, పోషకాలు అందడనికి కూడా వ్యాయామం సహకరిస్తుంది. శరీరం కూడా భారంగా అనిపించకుండా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.  గర్భవుతులు పెరిగే బరువును భరించడానికి అనువుగా శరీర కండరాలు, ఎముకల కదలిక సౌకర్యవంతంగా మారుతుంది. అంతే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డ బరువు వల్ల ఆ ప్రభావం వెన్నుపూస మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే వెన్ను నొప్పి లేకుండా, మోకాళ్ళ నొప్పులు వంటివి రాకుండా చక్కగా ఉండేలా వ్యాయామాలు దోహదం చేస్తాయి. అంతేకాదు, గర్భవతులు వ్యాయామం చేస్తే డెలివరీ సమయంలో ఆ నొప్పులు భరించడం కష్టతరం అనిపించదు. ఎందుకంటే వ్యాయామం వల్ల శరీరంలో కండరాలు, ఎముకలు దృఢంగా మారి మొత్తం మీద శరీరం గట్టిదనాన్ని పొంది ఉంటుంది.  అయితే గర్భవతులు విశ్రాంతి తీసుకోవడం ఎలానో.. శ్వాస క్రియ జరపడం ఎలానో కూడా తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల కండరాలు గట్టిపడతాయి. అలాగే వ్యాయామము చేయడానికి ప్రతిరోజు ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల శరీర తత్వానికి  మంచి క్రమశిక్షణ అలవడుతుంది. వ్యాయామం చేయడానికి చదునుగా ఉన్న ఉపరితలము గల్గిన స్థలము ఎంచుకోవాలి. అలాంటిచోట మందం పాటి దుప్పటి పరచుకుని దానిమీద వ్యాయామాలు చేస్తుంటారు. అయితే జారకుండా జాగ్రత్తగా ఉండాలి.    గర్భవతులకు నెలలు నిండేకొద్ది కాళ్ళు వాపు రావడం జరుగుతుంది.  ఈ వాపు తగ్గడానికి కూడా కొన్ని వ్యాయామములు తెలుసుకోవాలి.  వాపు తగ్గడానికి వ్యాయామం.  వెల్లకిలా పడుకుని మెల్లిగా కాళ్ళు పైకి ఎత్తాలి. ఆ తరువాత కాలి పాదాలను గుండ్రంగా తిప్పాలి. దీన్ని మొదట గడియారం తిరిగినట్టు తిప్పి, ఆ తరువాత దానికి రివర్స్ లో తిప్పాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళలో వాపులు తగ్గుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళ తిమ్మిర్లు తగ్గుతాయి.  కాళ్ళు భారంగా ఉన్న అనుభూతి తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయడం గర్భవతులు ఆరోగ్యానికి మంచిది. గమనిక:- గర్భవతులు వైద్యులు, నిపుణుల సలహా లేనిది సొంతంగా వ్యాయామాలు చేయడం తల్లిబిడ్డకు కూడా ప్రమాదం. కాబట్టి వైద్యుల సలహతోనే ఏ వ్యాయామం అయినా చెయ్యాలి.                                     ◆నిశ్శబ్ద.

గర్భవతులు ఆహారం గురించి అనుమానాలా?? నిజం తెలుసుకోండి!!

గర్భవతులు ఆహారం గురించి అనుమానాలా?? నిజం తెలుసుకోండి!! జీవితంలో ఏ దశలోనైనా మనం తీసుకునే ఆహారం ముఖ్యమైనది. స్త్రీ గర్భం ధరించినపుడు ఈ మాట మరీ నిజమని ఒప్పుకుంటారు. ఎందుకంటే గర్భవతి తీసుకునే భుజించే ఆహారం కడుపులో బిడ్డకు కూడా పోషకాలను అందించగలగాలి. అయితే అందరూ అనుకున్నట్టు సాధారణ రోజుల్లో తినే దానికి రెట్టింపు గర్భం మోసున్న రోజుల్లో తినాలని అర్థం కాదు. గర్భం దాల్చక ముందు కంటే గర్భం దాల్చిన తరువాత ఎక్కువ తినవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ క్రొవ్వు పట్టేంతగా తినకూడదు క్రొవ్వు ఎక్కువైతే గర్భవతులు ప్రసవం కష్టమవుతుంది. అదీకాక ఈ అదనపు క్రొవ్వును కరిగించడానికి చాల కష్టపడవలసి వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు  ఆహారం విషయంలోనే కాదు, బరువు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.  గర్భిణీ స్త్రీలు డాక్టర్ల దగ్గరకు టెస్టుల కోసం వెళ్లినపుడు అక్కడ బరువు చూడటం అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు డాక్టర్లే బరువు తగ్గడం, పెరగడం అనే విషయాల గురించి చెబుతాడు. బరువు విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. గర్భవతులు అందరికీ వర్తించే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు ఉంటాయి. జ్యుస్ లు, లిక్విడ్స్,  మొదలైనవి  గర్భిణీ స్త్రీలు  కావలసినన్ని తీసుకోవాలి. అయితే వీటి తయారీకి పంచదార ఉపయోగించకూడదు చక్కెర అదనంగా తింటే క్యాలరీలు పెరిగి శరీరం బరువు ఎక్కువ ఆవుతుంది. మామూలుగా ఉన్న బరువుకు గర్భవతిగా వున్న సమయములో నున్న బరువుకు 20 కిలోల కంటే ఎక్కువ తేడా వుండకూడాదు. ఇంతకంటే ఎక్కువ బరువు వుండటం మంచిది కాదు. గర్భిణీ స్త్రీ తినే తిండిని బట్టే బిడ్డ పెరుగుతుంది. అందువల్ల తినే తిండి నాణ్యతగా ఉండాలి.. తల్లీ బిడ్డకు ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని ఎన్నిక చేసుకోవాలి. తినే ఈ భోజనం ఎంపిక చేసుకున్న ఆహార పదార్థాల నుండి తయారు చేయాలి. పోషణ పదార్థాలు గల ఆహారాన్ని తీసుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా, బలంగా పెరుగుతాడు. విటమినులు, ఖనిజలవణాలు లోపించిన ఆహారాన్ని ఎన్నిక చేసుకున్నట్లయితే బిడ్డ ఆరోగ్యము నష్టానికి గురి అవుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. సారం లేని భోజనం ఎముకలు దంతాల పెరుగుదలను అరికడుతుంది. బిడ్డ దేహంలో నిరోధక శక్తి తగ్గి పుట్టిన తరువాత ప్రమాదకరమైన రోగాలకు గురి అవుతాడు. సారం లేని ఆహారం తీసుకున్న స్త్రీ గర్భవతిగా ఉన్నంత కాలము ప్రసవ సమయంలోను కష్టపడవలసి వస్తుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లికి శక్తి లేకుండా పోతుంది. గర్భిణీ స్త్రీ గర్భంలో బిడ్డ వేగంగా వృద్ధి పొందుతూ వుంటాడు. సరైన పెరుగుదలకు పోషకాలు విటమిన్లు బిడ్డకు అవసరమవుతాయి. విటమినులు కొన్ని మన శరీరంలో నిల్వ ఉండవు. అందువల్ల ఈ విటమినులలో గల ఆహార పదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీకి విటమినులు గల ఆహారం చాలా మేలు కలుగజేస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

మీ పిల్లలు రజస్వల కావడం లేదా?? అయితే తప్పకుండా తెలుసుకోవలసిన విషయమిది!!

మీ పిల్లలు రజస్వల కావడం లేదా?? అయితే తప్పకుండా తెలుసుకోవలసిన విషయమిది!! మహిళల్లో రజస్వల అవడం, ఋతుస్రావం అనేవి చాలా సాధారణమైన విషయాలు. అయితే.. కొందరిలో బుతుస్రావం కనబడకపోవడం మొదటి నుంచీ ఉంటే మరి కొందరిలో సడన్ గా ఆగిపోతుంది. కొందరు ఆడపిల్లలు యుక్తవయస్సు వచ్చినా రజస్వల అవరు. పైగా పొత్తికడుపు దగ్గర ఎత్తుగా తయారవుతుంది. అది చూసిన కొందరు ఆ అమ్మాయి గర్భవతి ఏమో అనుకుని పొరబడుతూ ఉంటారు. మహిళల్లో జరగవలసిన సహజ ప్రక్రియ అయిన ఈ రజస్వల కావడం తమకు జరగలేదని ఇలాంటి అమ్మాయిలు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ‘క్రిప్టోమెనోరియా' అనే ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆ స్త్రీ ఎంతకీ రజస్వల అవడం ఉండదు. కాని కొంతకాలానికి పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా ఎదుగుతుంది. తెలియనివారు దానిని చూసి గర్భిణీ అని కూడా 'కుంటారు ‘క్రిప్టోమెనోరియా' పరిస్థితిలో స్త్రీ నిండుగా ఉంటుంది. వక్షోజాలు పూర్తిగా వస్తాయి. రూపంలో ఎటువంటి తేడా ఉండదు.  అయినా రజస్వల అయినట్లు కనబడదు. ఇటువంటి స్త్రీలు రజస్వల అవక పోవడం ఉండదు. రక్తస్రావం మాత్రం కనబడదు. దానికి కారణం యోనిద్వారం దగ్గర కన్నె పొర పూర్తిగా మూయబడి ఉంటుంది. వీరిలో నెల నెలా బహిష్టులు అవడం ఉంటుంది.కాని రక్తస్రావం కనబడదు. వీరిలో కలిగేర రక్తస్రావము బయటకు రావడం కుదరక మర్మావయవాల లోపలే నిలువచేరి పోతుంది. అలా బహిష్టు రక్తం నిలవ చేరిపోవడంతో గర్భా శయం ఉబ్బుకు వస్తుంది. మొదట్లోనే కన్నె పొర పూర్తిగా మూసి ఉంచిన పరిస్థితిని గుర్తించకపోతే 6-7 మాసాలంత గర్బిణీలాగా కనబడే అవకాశం లేకపోలేదు. ఇలా మూసి ఉంచిన కన్నె పొరని ఆప రేషను చేసి తొలగిస్తే లోపల పేరుకుని పోయిన రక్తమంతా బయటకు వచ్చేస్తుంది. కాన్పు అయిన కడుపులాగా అంతా తగ్గిపోతుంది. కొందరు మొదట్లో నెల నెలా బహిష్టు మామూలుగా అవుతారు. ఆ తరువాత బహిష్టు రావడం ఆగిపోయి అంతు పట్టని రహస్యంగా మిగిలిపోతాయి. హార్మోన్ల లోపంవల్ల బహిష్టులు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, మెంటల్ షాక్ వల్ల బహిష్టులు ఆగిపోవచ్చు. రక్తహీనత తీవ్రంగా ఉంటేకూడా బహిష్టులు వుండవు. పిట్యూటరీ గ్రంధి, ఎడ్రినల్ గ్రంధిలో కంతులు ఏర్పడితే బహిష్టులు రావు. వయస్సు మళ్ళుతున్న స్త్రీలలో అకస్మాత్తుగా నెలసరి ఆగిపోయి తర్వాత  శాశ్వతంగా బహిష్టులు ఆగిపోవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితి 40-50 సంవత్సరాల వయస్సు వారికి కనబడుతుంది. ఇదే మెనోపాజ్. ఋతుస్రావం రావలసిన విధంగా నెల నెలా రావడం వుండక ఆగిపోవడాన్ని 'సెకండరీ ఎమెనోరియా' అంటారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని కేసుల్లో కారణం ఏదై నదీ అర్థం కాకుండా అవుతుంది. రోగి జననేంద్రియాల పరీక్ష, అల్ట్రాసౌండు ఎగ్జామినేషను, యం. ఆర్. ఐ, హార్మోన్ల పరీక్ష, ఇతర పరీక్షలు జరిపినప్పుడు ఎమెనోరియాకి కారణం తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా జననేంద్రియ సమస్యలు, మహిళల నెలసరి అనేవి చాలా సున్నితమైన అంశాలు. వీటి విషయంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని సొంత వైద్యం లో పరిష్కరించుకోకుండా డాక్టర్ ను కలవడం ఉత్తమం.                                      ◆నిశ్శబ్ద.

గర్భాశయ ఆపరేషన్ గురించి ఆసక్తికర విషయాలు!

గర్భాశయ ఆపరేషన్ గురించి ఆసక్తికర విషయాలు! మహిళల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు అన్నీ ఎక్కువ భాగం గర్భాశయానికి సంబంధించినవే ఉంటాయి. చాలామంది మధ్యవయసులోకి అడుగుపెట్టిన మహిళలు గర్భాశయ సమస్యలు భరించలేక ఏకంగా గర్భాశయాన్ని తొలగించుకోవడానికి సిద్ధపడుతుంటారు. ఈ గర్భాశయ తొలగింపు ఆరేషన్, దాని ప్రభావం, దానికి జాగ్రత్తలు తెలుసుకుంటే… గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ ను  "హిస్టరెక్టమీ” అంటారు. కొన్ని సార్లు గర్భాశయంతోపాటు దగ్గరగా వున్న అండవాహికను, అండాశయాన్ని కూడా తీసేయవలసి వుంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు ఒక్కొక్కసారి చుట్టూ వున్న అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం వుంది. ఇలాంటి సందర్భాలలో మిగతా భాగాల్ని కూడా తీసేయాల్సివస్తుంది. గర్భాశయాన్ని ఎందుకు తీసివేయాల్సి వస్తుంది ? గర్భాశయ ముఖ ద్వారంలో క్యాన్సర్ వున్నప్పడు. గర్భాశయంలో క్యాన్సర్ ఉన్నప్పుడు, బహిస్టు సమయంలో మాత్రమే కాకుండా ఇతర సమయాలలో కూడా రక్తస్రావం అవుతున్నప్పుడు, ఈ వ్యాధులు మందులతో నయం కానప్పుడు గర్భాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. రక్తహీనత, ఇతర సమస్యల వల్లా, గర్భాశయంలోపల గోడలను ఆనుకొని పెరిగే పెద్ద కణుతుల వల్లా (ఫైబ్రాయిడ్స్), విపరీత రక్తస్రావం. తరచు ఇన్ఫెక్షన్ కు గురి కావడం గర్భసంచి క్రిందికి జారటం అండవాహికలో అండాశయాలలో వ్యాధి వున్నప్పుడు, ప్రసవ సమయంలో గర్భాశయం చిరగటం లేదా ఆపటానికి వీలుకాని రక్తస్రావం అవుతుండడం మొదలైన  లక్షణాలు తీవ్రరూపం దాల్చినప్పుడు గర్భాశయాన్ని తీసివేయాల్సి వస్తుంది. గర్భాశయాన్ని తీసేస్తే ఏమవుతుంది ? కేవలం గర్భాశయాన్ని మాత్రమే తీసేసినపుడు మహిళల్లో నెల నెలా వచ్చే బహిస్టు ఆగిపోతుంది. కాని అండాశయాలు ఈస్ట్రోజన్ హార్మోనును ప్రతినెలా ఉత్పత్తి చేస్తూనే వుంటాయి. అండాశయాన్ని తీసేస్తే అకస్మాత్తుగా మెనోపాజ్ వస్తుంది. అలాంటి సందర్భాలలో హార్మోన్లు విడిగా ఇవ్వాల్సి రావచ్చు. హిస్టరెక్టమీని కుటుంబ నియంత్రణ పద్ధతిలో వాడటం కూడా ఎక్కువయింది. పిల్లలు పుట్టకుండా ఉండటానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. కొన్ని ముఖ్యమైన విషయాలు:-  గర్భాశయాన్ని తీసివేయడం అనేది భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. గర్భాశయ వ్యాధులు సోకినపుడు, ఆగకుండా నిరంతరం రక్తస్రావం అవుతున్నపుడు, గర్భాశయం దెబ్బ తిన్నపుడు దాన్ని తొలగించాల్సి ఉంటుంది.  ఆపరేషన్ తరువాత విపరీతమైన నొప్పి, జ్వరం రావచ్చు. పొత్తి కడుపు పుండులా అనిపిస్తుంది.  ఆపరేషన్ తరువాత కూడ రక్తస్రావం జరిగినా, కుట్ల దగ్గర చీము పట్టినా, ఇన్ఫెక్షన్ సోకినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. గర్భాశయాన్ని మాత్రమే తొలగిస్తే బహిస్టు ఆగిపోతుంది. కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకినపుడు అండాశయాన్ని కూడ తొలగించాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాలలో మెనోపాజ్ వస్తుంది.  శస్త్రచికిత్స చేయాలంటే.. ఆపరేషన్ అవసరమైన వాళ్లు బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి, బరువు మరీ తక్కువ ఉన్నవాళ్లు పెరగటానికి, డాక్టర్ల సలహా తీసుకోవాలి. హిమోగ్లోబిన్ 12 గ్రాములకంటే ఎక్కువ వుండేటట్టు చూసుకోవాలి, ఒకవేళ రక్తహీనత ఎక్కువగా వుండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే సర్జరీ కన్న ముందుగానే రక్తం ఎక్కిస్తారు. షుగర్, బి.పి. వున్నవాళ్లు వాటిని అదుపు చేసుకోవాలి. ఆపరేషన్ కోసం 2,3 బాటిల్స్ రక్తం రడీగా వుంచుకోవాలి.                                            ◆నిశ్శబ్ద.

Can You Really Lose Weight By Drinking More Water!

Can You Really Lose Weight By Drinking More Water!     Water is an essential nutrient your body needs to use to burn body fat! That’s why drinking water to lose weight is an important consideration in your weight loss program. We are made up of 55-75% water - that’s a lot of water! We need all of it for chemical reactions in physiological processes to burn fat and calories. It’s also used to transfer by-products of waste (from fat breakdown) away and out of our bodies. In some cases, when you’re dehydrated and there isn't enough water to dilute the body's waste products, kidney stones may form. The liver then has to step in to help the kidney. This taxes the liver, causing it to perform poorly for its other functions. This is really bad for weight loss because one of the major functions of the liver is to burn fat. Another healthy benefit of drinking water is that it helps maintain the body’s proper balance of body fluids. And it’s essential for replacing the large amounts of water lost each day. But drinking more water is not a magic diet formula. Drinking water is certainly important for overall health and is a great choice for hydration because it is calorie and caffeine free. However, simply drinking water doesn't impact your hunger. Thirst and hunger are sensed by different mechanisms in your body. Thirst develops from a rise in electrolytes in your blood or a decrease in blood volume. Hunger signals stem from declines of available fuel (such as glucose) in your body. Because of these separate mechanisms, it is unlikely that your body confuses thirst with hunger. Studies comparing people who drink water immediately before, or during, meals with those that don't drink water show no difference in the amount of calories that they consume. Drinking water can help with weight loss if you find that, in the absence of hunger, you still eat just to have something in your mouth. Drinking water, instead of eating, in these instances can help you decrease your overall daily calorie intake. Each day, drink enough water so that your urine is clear. A recent study showed that your metabolic rate jumps within 10 minutes of drinking ice-cold water, and it stays up for an additional 30 minutes after you drink it. Research has also found that drinking an average of 6.5 cups of water per day helped people consume 200 fewer calories a day. Drinking water is essential for keeping energy up, aiding the metabolism, burning fat, and more. It's the fluid your body needs for life, and it's an instrumental part in your weight loss. Other fluids can be useful, but water is obviously the best choice as it is calorie free. Forget about that whole eight cups a day thing, instead keep yourself hydrated whenever you can and the benefits of it are just good for your body and your health. So stay Hydrated and stay fit! ...Divya