పీరియడ్స్ నొప్పికి మహిళలు వాడే ఈ టాబ్లెట్ ఎంత డేంజరో తెలుసా?

పీరియడ్స్ నొప్పికి మహిళలు వాడే ఈ టాబ్లెట్ ఎంత డేంజరో తెలుసా?

దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను అయినా ఒకటి రెండు రోజులు భరించగలరు చాలామంది. కానీ నొప్పులను మాత్రం అస్సలు భరించలేరు. దీనికి కారణం ఏ పని చేయాలన్నా శరీరంలో వివిధ అవయవాలు, భాగాలు నొప్పితో సహకరించకపోవడమే. అందుకే నొప్పులు రాగానే మొదట టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుంటారు. ఇలాంటి నొప్పి మాత్రలలో మెప్టాల్ కూడా ఒకటి. ఇది సాధారణ నొప్పులకే కాకుండా పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను కూడా తగ్గిస్తుంది. సాధారణంగా నొప్పుల మాత్రలు 15నిమిషాలలోనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మెప్టాల్ కు సంబంధించి సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మాత్ర ఉపయోగించడం తగ్గించమని చెప్పింది. అసలు ఈ మాత్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, వైద్యులు ఏం చెబుతున్నారు? ఇది వాడటం ప్రమాదం ఎందుకు? పూర్తీగా తెలుసుకుంటే..

అసలు సమస్య ఇదీ..

అసలు సమస్య ఏంటంటే.. ఎలాంటి ఆందోళన లేకుండా ఈ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు.  ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయినప్పటికీ, పీరియడ్స్ లో వచ్చే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు, తలనొప్పి, కండరాలు,  కీళ్ల నొప్పులు,  అధిక జ్వరం నుండి ఉపశమనం పొందడానికి ఫెనామిక్ యాసిడ్ భారతదేశంలో సర్వసాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది Meftal, Mefkind, Mefnorm,  Ibuklin P పేర్లతో విక్రయించబడుతోంది.

డ్రగ్ సిండ్రోమ్..

మెప్టాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల చాలామందిలో డ్రగ్ సిండ్రోమ్ ఎదువుతుంది. డ్రగ్ సిండ్రోమ్ అనేది మందులు తీసుకున్న తరువాత దాదాపు 10శాతం మందిని ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఇసినోపిలియా, శారీరక  లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం, చర్మం పై  దద్దుర్లు, లెంఫాడెనోపతి, హెమటోలాజికల్ వంటి అసాధారణ లక్షణాలు మందులు తీసుకున్న రెండు నుండి ఎనిమిది వారాల తరువాత కనిపించడం ప్రారంభిస్తాయి. దీనికి పరిష్కారం కంటే సమస్య రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. ఈ మందుల వినియోగానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

ఆప్షన్స్..

మెఫెనామిక్ యాసిడ్ మందులపై ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శోరరస కణువులలో వాపు పెరుగుతుంది. మెఫెనామిక్ యాసిడ్ మందులు ఎవరైనా ఉపయోగిస్తంటే వాటికి ప్రత్యామ్నాయ మందుల గురించి ఆలోచించాలి.

మెప్టాల్ మందులు ఎక్కువ కాలం తీసుకుంటే అవి కడుపులో అల్సర్, రక్తప్రసరణ, పొట్టకు సంబంధించిన సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ఈ మందులకు ప్రత్యామ్నాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని  వేరే మందులు ఉపయోగించాలి.

అసలు సమస్యలివీ..

మెఫ్టాల్ మాత్రలు హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ మందుల వల్ల హృదయ సంబంధ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు మెప్టాల్ ను వినియోగించకపోవడమే మంచిది. ఇది కిడ్నీ సమస్యలను కూడా పెంచుతుంది.

                                                     *నిశ్శబ్ద.