హెయిర్ డై ఎడా పెడా వాడేస్తున్నారా..అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.!


హెయిర్ డై ఎడా పెడా వాడేస్తున్నారా..అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.!

ప్రతి ఒక్కరూ వాటిని పూర్తి చేసి తమ జుట్టుకు కొత్త రూపాన్ని తేవాలని తాపత్రయం పడుతుంటారు. ఇందుకోసం హెయిర్ స్ట్రెయిటెనింగ్, హెయిర్ కలరింగ్, హెయిర్ స్మూత్ చేయించుకోవడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. అయితే  కానీ, FDA (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఇటీవలే బాంబు పేల్చింది.  ఫార్మల్డిహైడ్ రసాయనం ఉన్నటువంటి హెయిర్ ఉత్పత్తుల వాడకాన్ని నిశేధించింది.  

స్ట్రెయిటెనింగ్, కలరింగ్, హెయిర్ స్మూత్ చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా..?


జుట్టును సిల్కీగా, మృదువుగా మార్చే ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాల వల్ల  భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ కలరింగ్ లో వాడే రసాయనాల వల్ల కళ్ళు, ముక్కు, గొంతులో చికాకు కలిగిస్తుందని. ఇది శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుందని  భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం:

జుట్టు ఉత్పత్తులు గర్భాశయం లేదా అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది.  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్ రికార్డ్) 2022 అధ్యయనం నుండి అనేక సూచనలు ఉన్నాయి. హెయిర్ ఉత్పత్తుల్లో వాడే ఫార్మాల్డిహైడ్  క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెయిర్ డై వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం:

తాజాగా వచ్చిన ఒక పరిశోధనలో హెయిర్ డై మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తుంది.  దాదాపు 80% హెయిర్ డై ఉత్పత్తులు హైడ్రోజన్ పెరాక్సైడ్ నుండి తయారవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. ఇవి మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది:

ఇక హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లు లేదా రిలాక్సర్‌లు రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కార్సినోజెనిక్ ఏజెంట్‌లను కలిగి ఉంటాయని ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, మిథిలిన్ గ్లైకాల్ వంటి సమ్మేళనాలు. దీనికి కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైద్యుల సూచన ఇదే:

సహజ సిద్ధమైన హెన్నా వంటి జుట్టు ఉత్పత్తులను గుర్తించి వాటిని మాత్రమే ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.