థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..!

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..!

చాలామంది మహిళలు సరిగా తినకపోయినా సరే లావుగా కనిపిస్తుంటారు. డైటింగ్ ఫాలో అయినా బరువు విషయంలో మార్పు ఉండదు. ఇలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు అసమతుల్యంగా మారడం, శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులు కావడం వల్ల బరువు పెరుగుతారు. థైరాయిడ్ ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య మరింత ఉదృతం అవుతుంది. థైరాయిడ్ ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలేంటో.. ఆయుర్వేదం వీటిని ఎందుకు తినకూడదని చెప్పిందో తెలుసుకుంటే..


పీనట్ బటర్.. (వేరుశనగ వెన్న)

పల్లీలు లేదా వేరుశనగలను గ్రైండ్ చేసి పీనట్ బటర్ తయారుచేస్తారు. వేరుశనగలలో ఉండే గాయిట్రేజెన్ కంటెంట్ కారంగా హైపోథైరాయిడిజం మరింత తీవ్రమవుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు వేరుశనగ, వేరుశనగలతో తయారుచేసే పీనట్ బటర్ తినకూడదు.

రాగులు..

ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ రాగులు థైరాయిడ్ ఉన్నవారికి సమస్య పెంచుతాయి. రాగులు సాధారణ వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ధాన్యం.  వీటిలో కాల్షియం, ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. కానీ వీటిలో గోయిట్రోజెనిక్ ఉంటుంది. వీటిని తినాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రాగులను బాగా నానబెట్టి, బాగా ఉడికించిన తరువాత నెలలో కెవలం రెండు మూడు సార్లు మాత్రమే తినవచ్చు.

బాదం..

బాదంలో సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ థైరాయిడ్ పనితీరుకు మంచివి. అయితే బాదం కూడా గోయిట్రోజెనిక్ ఆహారం. బాదంను ఎక్కువగా తీసుకుంటే  థైరాయిడ్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఎక్కువ పనిచేస్తే అయోడిన్ ను గ్రహించే సామర్థ్యంను తగ్గిస్తుంది. అందుకే థైరాయిడ్ ఉన్నవారు రోజుకు 3కు మించి బాదం పప్పులు తినకూడదు.

సోయా..

సోయా ఆహారాలు కూడా థైరాయిడ్ లక్షణాలు ప్రభావితం చేస్తాయి.  థైరాయిడ్ గ్రందికి చికాకు కలిగించే గోయిట్రోజెన్లు సోయా ఉత్పత్తులలో ఉంటాయి. ఈ కారణంగా సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

గోధుమ..

థైరాయిడ్ ఉండి బాగా లావుగా ఉన్నవారు అన్నానికి బదులుగా చపాతీలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.  కానీ థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తినకూడదు. గోధుమలలో ఉండే గ్లూటటెన్ గోయిట్రోజెనిక్ సమ్మేళనం. ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడ్ ఉన్నవారు గోధుమలు చాలా తక్కువగా తీసుకోవాలి. గ్లూటెన్ రహిత ఆహారం తీసుకునే వ్యక్తులు థైరాయిడ్ గ్రంధిపై దాడిచేసి యాంటీబాడీలను రక్తంలో తక్కువగా కలిగి ఉంటారు.

                                             *నిశ్శబ్ద.