English | Telugu

Yashmi Elimination: యష్మీ ఎలిమినేషన్.. ఎట్టకేలకు కన్నడ బ్యాచ్ నుండి ఒకరు అవుట్!

బిగ్ బాస్ సీజన్-8 లో గత పన్నెండు వారాలుగా పన్నెండు మంది తెలుగు వాళ్లనే ఎలిమినేట్ చేశారు. అయితే ఈవారం నామినేషన్స్‌ చాలా భిన్నంగా జరిగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా వచ్చి నామినేట్ చేయడంతో.. కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ బయటజొచ్చేసింది.

యష్మీ ఈ వారం ఎలిమినేటి అయిందనే న్యూస్ బయటకు రావడంతో బిగ్ బాస్ ఆడియన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. గత సీజన్ శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషంగా ఉన్నామంటు తెగ కామెంట్లు చేస్తున్నారు. నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ.. ఈ ఐదురుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే నలుగురు కన్నడ బ్యాచ్ నామినేషన్స్‌లోకి రావడంతో.. ఖచ్చితంగా వాళ్లలోనే ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. అంతేకాదు.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందనే ప్రచారం నడిచింది. ఎందుకంటే.. టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండాలంటే. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అనేది ముఖ్యం. అయితే బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నాడో ఏమో.. సీజన్ 8 కాబట్టి ఏకంగా ఎనిమిది మందిని ఫినాలేకి పంపబోతున్నారో ఏమో కానీ.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాకుండా సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టారు.

ఈ వారం నామినేషన్ లో ఉన్న యష్మీ, పృథ్వీ ఇద్దరికి ఓటింగ్ లేదు. వీరిద్దరితో పోలిస్తే ప్రేరణకు కాస్త మెరుగైన ఓటింగ్ ఉండటం వల్ల తను డేంజర్ జోన్ లో లేదు.‌ ఇక నబీల్ కి అత్యధికంగా ఓటింగ్ జరిగింది. నిఖిల్ సెకెంఢ్ ప్లేస్ లో ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి యష్మీ ఎలిమినేషన్ అవ్వడంతో మొట్టమొదటి సారిగా ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందంటు నెటిజన్లు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.