English | Telugu

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

అది గంగ పక్కనున్న ఆవిడ చూసి గంగకి చదివి వినిపిస్తుంది. అందులో రుద్ర ఏం రాసాడంటే.. నేను రుద్రని నువ్వు అకాడమీలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావో అని భయంగా ఉందని ఆలోచిస్తున్నానని రుద్ర రాస్తాడు. అది గంగ చదువుతుంది. మళ్ళీ తనకి రిప్లై గా ఒక పేపర్ పై నేను బాగానే ఉన్నాను సర్ అని రాసి బయట వైపు విసిరేస్తుంది. అది రుద్ర చదువుతాడు. అలా కొద్దీసేపు గంగ, రుద్ర పేపర్స్ అటువైపు ఇటువైపు విసురుతూ విసురుతుంటారు. అదంతా అకాడమీ బిల్డింగ్ నుండి పారు చూసి.. ఈ గంగని ఈ రాత్రికే సస్పెండ్ చేసేలా చేస్తానని అనుకుంటుంది. ఆ తర్వాత రుద్ర మళ్ళీ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ ఒక్కడివే వచ్చావా అని శకుంతల కోప్పడుతుంది.

రుద్ర గదిలోకి వెళ్ళగానే శకుంతల బయట నుండి లాక్ వేస్తుంది. రుద్ర బయటకి వెళ్తే అకాడమీ ముందు వాచ్ మెన్ లా ఉంటాడు. అలా చేస్తే ఈ ఇంటి పరువుపోతుందని శకుంతల చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో ఎవరు చెప్పిన శకుంతల వినదు. మరొకవైపు గంగ వాళ్ల రూమ్ లో ఫ్యాన్ కూడా తిరగదు. కానీ పారు వాళ్ల గదిలో ఏసీ, టీవీ ఉంటుంది. పారు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. దాంతో గంగ వాళ్ళ రూమ్ మేట్స్ వెళ్ళి చూస్తారు. అదేంటి మన రూమ్ లో ఫ్యాన్ కూడా రావడం లేదు కానీ వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని గంగతో తన రూమ్ మేట్స్ అంటారు. మనం కూడా ఎంజాయ్ చేద్దాం అంత్యాక్షరీ ఆడుదామని గంగ తన ఫ్రెండ్స్ తో చెప్తుంది. అలా గఃగ తన రూమ్ మేట్స్ అందరు సరదాగా ఉంటే పారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం చూడలేకపోతుంది. ఈ రోజు రాత్రికి గంగని ఎలాగైనా సస్పెండ్ చేపిస్తానని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.