English | Telugu

జైలుకి వెళ్లిన వసంతి!


బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న టాస్క్ కు తెర పడింది. రెండు టీమ్స్ లో, ఒక టీం గెలవగా, మరొక టీం ఓడిపోయింది. అయితే ఆ ఓడిన టీంలో వాళ్ళు అందరు కలిసి టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేయని హౌస్ మేట్ ఎవరో బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. అందరు ఏకాభిప్రాయంతో వసంతిని ఎంపిక చేయడంతో, తను జైలుకి వెళ్ళింది.

అయితే అంతకముందు మొదలైన టాస్క్ లో మొదటగా శ్రీసత్య, "నేను ఈ ఛాలెంజ్ ని తీసుకుంటా" అని చెప్పింది. చిట్టీలు వేసి అందరు ఎంపిక చేసుకున్నారు. అందులో శ్రీసత్య పేరు రావడంతో తాను నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినెట్ కి ఓకే అని చెప్పింది.

కాగా మరుసటి రోజు శ్రీసత్య వచ్చి, "నేను కూడా గేమ్ లో టఫ్ ఫైట్ ఇచ్చాను. నేను డైరెక్ట్ నామినేట్ కాను" అని చెప్పడంతో, మళ్ళీ వారి గ్రూప్ హౌస్ మేట్స్ తో ఓటింగ్ పోల్ నిర్వహించడం జరిగింది. కాగా రోహిత్, శ్రీసత్యకి ఓట్ వేయగా, గీతు, వసంతి కి వేసింది. అర్జున్, శ్రీసత్యకి ఓట్ వేయగా, తను మళ్ళీ, "నేను నీతోనే ఉన్నాను అర్జున్. అలా ఎలా మర్చిపోయావ్", అని శ్రీసత్య చెప్పగానే ఒపీనియన్ చేంజ్ చేసుకొని మళ్ళీ మెరీనా కి వేసాడు. మెరీనా, గీతుకి ఓట్ వేసింది. కాగా వసంతి, గీతుకి వేసింది. కాగా చివరగా రాజ్, వసంతికి వెయ్యడం తో నెక్స్ట్ వీక్ లో డైరెక్ట్ నామినేషన్ ఉంది. కాగా వసంతి ఏడ్చేసింది.

"ఇది ఏం గేమ్ అసలు, టాస్క్ ఆడినా, ఆడకపోయినా పర్ఫామెన్స్ లేదు అంటారు. ఏమన్నా అంటే నామినేషన్ కి భయపడుతుంది అని, డిఫెండ్ చేసుకోలే అని అన్ని మీరే అంటారు. ఇక ఆడకుండా ఖాళీగా ఉండాలి" అంటు బాధపడింది వసంతి. ఇనయా, మెరీనా ఇద్దరు వసంతిని ఓదార్చే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని పిలిచి, "ఈ వారం టాస్క్ లో ఎవరు డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం హౌస్ లో ఎవరో డిజాస్టర్ అని చెప్పి, బ్యాడ్జ్ పెట్టి కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇందులో రేవంత్ వాసంతి మధ్య గట్టి ఆర్గుమెంట్ జరిగింది. అయితే ఎక్కువ ఓట్లు వసంతికి వచ్చిన కారణంగా వసంతి జైలుకి వెళ్ళింది.

"మళ్ళీ బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు జైలులోనే ఉండవలసి వస్తోంది వసంతి" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే జైలు నుండి బయటకొచ్చాక తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన రేవంత్ తో మాటలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.