English | Telugu

వీళ్ళే డాన్స్ ఐకాన్ కి మెయిన్ మెంటార్స్

తాను స్టార్ట్ చేయబోయే "డాన్స్ ఐకాన్ "షో గురించి చెప్తూ ప్రమోట్ చేసుకోవడానికి ఏ సందర్భాన్ని వదలడం లేదు ఓంకార్. ఇక ఈ షోకి ఫేమస్ టీవీ యాంకర్లు, శ్రీముఖి, డాన్స్ మాస్టర్ యష్, యాక్టర్ మోనాల్ గుజ్జర్ ఈ షోకి మెయిన్ మెంటార్స్ కి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ కొరియోగ్రాఫర్, జడ్జి శేఖర్ మాస్టర్ త్వరలో రాబోయే ఈ డ్యాన్స్ షోకి ప్రధాన న్యాయనిర్ణేతలలో ఒకరుగా ఉండబోతున్నారంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఓంకార్ ఇంతకుముందు చేసిన డ్యాన్స్ షో 'డాన్స్ +'లో యష్, మోనాల్ జడ్జెస్ గా ఉండగా, ఇప్పుడు తాజాగా వాళ్ళతో శ్రీముఖి చేరింది. ఈ షోలో 5 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు పాల్గొంటారని గతంలోనే చెప్పాడు ఓంకార్. 'డ్యాన్స్ ఐకాన్' ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టీవీ, OTT ప్లాట్ఫారం పై ఒకేసారి ప్రసారమయ్యే మొదటి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలలో ఇది ఒకటి. అయితే, ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి ఆఫీషియల్ న్యూస్ ఇంకా బయటకు రాలేదు.

తనకు ఈ అవకాశం వచ్చినందుకు తాను ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని ఈ సందర్భంగా షో హోస్ట్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను ఇంతకుముందు చేసిన డ్యాన్స్ షోల కంటే కూడా ఈ షో చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పారు. అన్ని షోస్ లోకి ఈ షోని ఒక ఐకాన్ లా మార్చడం కోసం 'డ్యాన్స్ ఐకాన్' అనే టైటిల్ పెట్టినట్లు చెప్పారు. ఈ షోకి సంబంధించి కొరియోగ్రాఫర్స్, పార్టిసిపెంట్స్ జీవితాలను మలుపు తిప్పేలా డిజైన్ చేశామన్నారు. అంతేకాదు ఈ షోలో విన్ ఐన కొరియోగ్రాఫర్ టాలీవుడ్ టాప్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేస్తారని చెప్పుకొచ్చారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.