Read more!

English | Telugu

పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం

జబర్ధస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ప్రవీణ్ తండ్రి మరణించడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొంత కాలంగా ప్రవీణ్ తండ్రి బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆయన్ని బతికించేందుకు  వైద్యులు ఎన్నో  ప్రయత్నాలు  చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. చిన్న వయస్సులోనే తల్లిని పోగొట్టుకున్న ప్రవీణ్ కు ఇప్పుడు  ఇప్పుడు తండ్రి కూడా దూరమయ్యేసరికి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

తన తండ్రి మాత్రం ఇంకో పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేసి ఉన్నంతలో చదివించారంటూ.. మాకు అమ్మైనా, నాన్నైనా అన్నీ నాన్నే. మాకు ఎవ్వరూ లేరు. మా నాన్నే మాకు ఆస్తిపాస్తి’ అని గతంలో ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ  విషయం తెలిసిందే. పటాస్ కామెడి షోలో పంచ్‌లు, ప్రాసలతో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రవీణ్.  ఐతే  కరోనా లాక్‌డౌన్ వలన  'పటాస్' షో ఆగిపోయేసరికి  ప్రవీణ్ జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.   రాకింగ్ రాకేష్ టీమ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ  అదిరిపోయే పంచులు, ప్రాసలతో హైలైట్ అవుతున్నాడు.