English | Telugu

సుమ కొంటె పనులు కూడా స్పెషలే

సుమ షోస్ లోనే కాదు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసే రీల్స్ లో కూడా కొంటె పనులు చేస్తూ తెగ నవ్వించేస్తుంది. రీసెంట్ గా ఒక డాన్స్ స్టెప్ ని తన స్టాఫ్ పర్సన్ కి నేర్పించింది. అంతకుముందు డాగ్ ట్రైనర్ గా మారింది. ఇక ఇప్పుడు ఒక ఫన్నీ రీల్ తో మనముందుకు వచ్చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రీల్ ని చేయడానికి ట్రై చేసింది. మ్యూజిక్ తో స్లోగా మోకాళ్ళ మీద కింద కూర్చునే ఈ రీల్ సుమ తనదైన కామెడీ స్టైల్ లో చేసింది. కానీ నడుము విరిగిన మ్యూజిక్ తో ఎక్స్ప్రెషన్ తో ఒక్కసారి లేచి నిలబడుతుంది. దీనికి గాను "ప్రతీ ట్రెండ్ మనకు సంబంధించినది కాదు " అనే కాప్షన్ పెట్టి ఈ వీడియో పోస్ట్ చేసింది. సుమ ఏది చేసిన అందులో ఒక వెరైటీ ఉంటుంది.

ఆమె ఎక్కడుంటే అక్కడ వాతావరణాన్ని కూల్ చేసేస్తుంది తన అచ్చమైన తెలుగు మాటలతో, డైలాగ్స్ తో, పంచులతో..అందుకే సుమ ఎక్కడ షో చేసినా అది గ్రాండ్ సక్సెస్ ఐపోతుంది. ఆమె ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మార్చుకుంటుంది కాబట్టే ఇప్పటికీ సూపర్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. ఈమెతో పాటు ఉన్నవాళ్లు చాలామంది కూడా ఈమె లాంటి క్రేజ్ ని సంపాదించుకోలేకపోయారు. ఇక సుమ చేసిన ఈ వీడియోకి చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. నవ్వుకుంటున్న ఎమోజిస్ పోస్ట్ చేస్తున్నారు. ఏ ఏజ్ లో ఆ ఏజ్ పనులే చేయాలి, ఈ వయసులో అనవసరంగా కష్టాలు తెచ్చుకోకండి , బామ్మ గారు ఎందుకు మనకు ఇవన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.