English | Telugu
వేద పై దాడికి సిద్ధపడ్డ కైలాష్.. అదే టైం లో..!
Updated : Jul 1, 2022
నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. ఖుషీ అనే పాప కోసం ఇష్టం లేకపోయినా జంటగా మారిన యష్, వేద ల కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. స్టార్ ప్లస్ లో సూపర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహబ్బతే` సీరియల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. గత కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్రసారం అవుతూ విజయవంతంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ నటించారు.
కైలాష్ గురించి యష్ కు చెప్పాలని నిర్ణయించుకున్న వేద చెప్పలేకపోతుంది. అయితే యష్ .. వేద మాటలని బట్టి ఏదో జరిగిందని ఆరా తీయడం మొదలు పెడతాడు. కానీ వేద మాత్రం ఫోన్ మాట్లాడుతూనే ఐ మిస్ యూ అని పెట్టేస్తుంది. దీంతో యష్ లో మరింత అనుమానం మొదలవుతుంది. వెంటనే తన సోదరుడు వసంత్ కి విషయం చెప్పి ఏం జరిగిందో కనుక్కో మంటాడు. అయితే ఇంటికి వెళ్లి వేదతో మాట్లాడిన వసంత్ కు మరింత అనుమానం మొదలవుతుంది. వదిన ఎందుకిలా వుందని అమ్మని కనుక్కుంటానని వెళ్లి విషయం మాలినితో చెబుతాడు.
విషయం యష్ వరకు వెళ్లొద్దని, అతనికి ఫోన్ చేయొద్దని చెప్పినా వేద పొగరుగా తన మాటని లెక్కచేయలేదని మాలిని ఆగ్రహిస్తుంది. వేద బాగానే వుందని, అనవర ఆరాలు యష్ ని మానుకోమని చెప్పమంటుంది. దీంతో వసంత్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మాలిని .. వేద దగ్గరికి వెళ్లి చెప్పినా కూడా ఎందుకు యష్ కు విషయం చెప్పావని నిలదీస్తుంది. బెదిరిస్తుంది. అదే సమయంలో వేద తల్లి వీరి సంభాషణ విని షాక్ అవుతుంది. ఏం జరిగిందని ఆరాతీస్తుంది. మాలిని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ముంబై నుంచి బయలు దేరడానికి సిద్ధమవుతున్ యష్ వేద గురించే ఆలోచిస్తూ తను ఎందుకు ఇలా వుందని ఆలోచిస్తుంటాడు. కట్ చేస్తే... వేద పై దాడికి కైలాష్ సిద్ధపడ్డతాడు .. అదే టైం లో ఇంటికొచ్చిన యష్.. లోపల ఏం జరుగుతుందో అని అటుగా వెళుతుంటాడు. తన ఎంట్రీతో ఏం జరగబోతోంది.. కైలాష్ కు ఈ రోజు మూడినట్టేనా.. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.