English | Telugu

అరేయ్ చూడండిరా...కీర్తి సురేష్ గారు నన్ను పొగిడారు..

సుహాస్ బిగ్ స్క్రీన్ మీద ఆచి తూచి మంచి మూవీస్ చేస్తూ ఉంటాడు. ఆయన చేసే మూవీస్ తో ఇండస్ట్రీకి ఒక ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. కలర్ ఫోటో, ప్రసన్న వదనం, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి ఆడియన్స్ కి నచ్చే ఎన్నో మూవీస్ చేసాడు. ఐతే సుహాస్ మీద ఇంత వరకు నెగటివ్ ట్రోలింగ్ అనేది ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే తిడుతూ ఉంటారట. ఇక రీసెంట్ కీర్తి సురేష్, సుహాస్ సుమ చాట్ షోకి వచ్చారు. "పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అవకాశం వస్తే వీళ్లల్లో ఎవరితో డైరెక్షన్ చేస్తారు" అని సుమ అడిగింది. "వామ్మో నేను అంత రిస్క్ చేయలేను, టెన్షన్ పడలేను..డైరెక్షన్ మానేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను నిజంగా డైరెక్షన్ చేస్తే నాని అన్నతో చేస్తాను. డైరెక్షన్ అవ్వాలని ఉంది.

కానీ హీరోగా చేయడం బాగుందని ఇలా ఉండిపోయాను." అని చెప్పాడు సుహాస్. "సుహాస్ మీకు హేటర్స్ ఉంటే వాళ్లకు ఎం చెప్తారు" అని అడిగింది సుమ. "మీకు హేటర్స్ ఉన్నారా..సుహాస్ కి హేటర్సా..." అని షాకయ్యింది కీర్తి సురేష్. "లేదక్కా హేటర్స్ ఉంటే నా ఫ్రెండ్స్ లోనే ఉంటారు. నన్ను బయట ఎవరూ ఏమీ అనరు కానీ నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఛీ అదేం యాక్టింగ్ అంటూ తిడతారు. నా ఫ్రెండ్సే నా హేటర్స్ " అన్నాడు సుహాస్.."చూడండిరా కీర్తి సురేష్ గారు కూడా పొగుడుతున్నారు. మీకేమొచ్చిందిరా నాయనా" అని నవ్వుతూ చురక అంటించాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.