English | Telugu

సుధీర్ ఈజ్ బ్యాక్!


బుల్లితెరపై సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్ కనిపిస్తే చాలు ఆ షో హిట్ అన్నట్టుగా మారిపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ఈటీవీ, మల్లెమాల ఈవెంట్స్ లోకి సుధీర్ తిరిగొచ్చేశాడు. ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా మల్లెమాల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో సుధీర్ మళ్ళీ మెరిశాడు. సుధీర్ ఎంట్రీ ఆడియన్స్ కి కికిక్కిచ్చింది. కానీ ఆదికి మాత్రం పెద్దగా నచ్చినట్టు లేదు. తన మీద ఫోకస్ అంత సుధీర్ మీదకు వెళ్లిపోతుందేమో అని భయపడి అందరూ పిచ్చ కౌంటర్లు వేసి సుధీర్ ని మాట్లాడనివ్వకుండా చేసేసారు. భలే మంచి రోజు అనే ఈ స్పెషల్ ఈవెంట్ లో సుధీర్ ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేసాడు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ ఈవెంట్ లోకి సుధీర్ గ్రాండ్ ఎంట్రీ అద్దిరిపోయింది.

ఇక ఆయనొస్తే మిగతా గ్యాంగ్ కూడా పిచ్చి డైలాగ్స్, స్టెప్స్ వేస్తారని తెలిసిందే కదా. వాళ్లందరినీ చూసి సుధీర్ "ఏంట్రా ఇది" అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి "సర్ మారితే అందరూ మారతారు మరి" అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. "వీళ్లందరితో నా ఎంట్రీ పెట్టారేంటి" అని సీరియస్ గా అనేసరికి "నువ్ వస్తున్నావ్ అని తెలిస్తే ఎంట్రీ కాదు.. ఈవెంట్ కూడా ఒప్పుకోనన్నాడు" అని ఇమ్ము అనేసరికి ఇంద్రజ పడీపడీ నవ్వేస్తుంది. "మిమ్మల్నందరినీ ఒక్క చోట ఉంచుతాడు ఈయన" అంటూ ప్రదీప్ కూడా జోక్ వేసేసరికి "ముందు ఆయన్ని ఒక్క చోట ఉండమనండి చాలు" అంటూ ఆది పంచ్ పిలుస్తాడు. తర్వాత ఒక అమ్మాయికి లవ్ ట్రాక్ వేసే స్కిట్ చేస్తాడు సుధీర్. అందులో అమ్మాయికి అన్నలుగా ఆది, రాంప్రసాద్, ఇమ్ము నటిస్తారు. "అన్నయ్య నేను ప్రేమించింది ఇతన్నే " అంటూ సుధీర్ ని పరిచయం చేస్తుంది వాళ్ళ అన్నలకి. "ఏం చూసి ప్రేమించావు వీడిని" అంటాడు ఆది. "అవన్నీ అప్పుడు సర్..ఇప్పుడు నేను మారిపోయానండి" అని సుధీర్ అంటాడు.

"ఏది పక్క ఛానల్ కి మారిపోయావా" అంటూ కౌంటర్ వేస్తాడు ఆది. "మీ చెల్లి కోసం మీరేం చెప్పిన చేస్తా సర్ " అని సుధీర్ అనేసరికి " నా జుట్టు కాస్త మర్దన చెయ్యి.. చూసావా చివరికి నువ్వు ఏ స్టేజికి వచ్చావో " అని కౌంటర్ వేస్తాడు ఇమ్ము. ఆటో రాంప్రసాద్ కి చేతులు పడతాడు. తర్వాత "నా మోకాళ్ళు నొక్కు అని ఆది అనేసరికి సుధీర్ మోకాలి మీద కూర్చుంటాడు ". " చూసావా కావాలని కిందకి వంగాడు ఎందుకంటే.. మనల్ని బాడ్ చేయడానికి" అంటూ ఆది కౌంటర్ వేస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.