English | Telugu
శ్రీహాన్ విన్ ఐతే ఏడాదిలో పెళ్లి అని ప్రామిస్ చేయండి!
Updated : Sep 22, 2022
బిగ్ బాస్ లో ఆడుతున్న కంటెస్టెంట్స్ గెలవాలని కోరుతూ వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్, అందరూ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. అలాగే శ్రీహాన్ కి వోట్ చేయమంటూ సిరి హన్మంత్ కూడా ఓట్లు అడిగింది. ఐతే ఒక నెటిజన్ దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ "ఆస్క్ మీ ఆ క్వశ్చన్" సిరీస్ లో సిరిని ఒక విషయం అడిగాడు. "శ్రీహాన్ విన్ ఐతే వన్ ఇయర్ లో పెళ్లి అని ప్రామిస్ చేయండి. అప్పుడే ఓట్లేస్తా" అన్నట్టుగా ఒక ప్రశ్న అడిగేసరికి, "ఐ యాం సిగ్గింగ్ ఇక్కడ" అంటూ సిగ్గుపడుతూ ఆన్సర్ ఇచ్చింది సిరి.
"అక్కా నువ్వెంత హైపర్ గా ఉంటావో, శ్రీహాన్ అంత కూల్ గా ఉంటాడు" అని ఇంకో నెటిజన్ అంటే, "అవును నిజమే" అంటూ జవాబిచ్చింది. "అక్కా! బావ నీతో కూడా కోపంగా ఉంటాడా?" అని అడిగిన ప్రశ్నకు "సమస్యే లేదు.. నాకే చాలా ఓపిక తక్కువ. తనకు మాత్రం ఓపిక చాలా ఎక్కువ" అంటూ ఒక నవ్వు ఎమోజి పెట్టి ఆన్సర్ చేసింది. ఇలా సిరికి, నెటిజన్స్ కి మధ్య క్యూట్ చాటింగ్ జరిగింది.