English | Telugu

సింగర్స్‌కు ఇది మంచి అవకాశం...డోంట్ మిస్


జీ తెలుగులో సరిగమప కొత్త సీజన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గడిచిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సరిగమప. ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈ ఆదివారం అంటే ఆగస్ట్ 25 న హైదరాబాద్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 15 నుంచి 30 సంవత్సరాల వయసున్న గాయనీ గాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ ఆడిషన్స్ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. హైదరాబాద్లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్ స్కూల్ దగ్గర, గోకుల్ థియేటర్ ఎదురుగా, సనత్ నగర్లో ఆడిషన్స్ జరగనున్నాయి. జీ తెలుగు సరిగమప సీజన్ 16 ఆడిషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9154670067 నెంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పాట పాడిన వీడియోలను 9154670067 నెంబర్కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఈమెయిల్ ద్వారా పంపవచ్చు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.