English | Telugu

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది.

మేడమ్ లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని ఆవిడ అనగానే అప్పు కాదనలేక వెళ్తుంది. లోపల రేణుక భర్తతో ఆవిడ ఉన్న ఫోటో చూసి అప్పు షాక్ అవుతుంది. అతను ఎవరని అప్పు అడుగగా నా భర్త అని చెప్తుంది. పెళ్ళి జరిగి ఎన్ని నెలలు అవుతుందని అప్పు అడుగగా ఆరు నెలలవుతుంది. నా మొదట భర్త చనిపోయాడు‌ నన్ను నా పాపని బాగా చూసుకుంటాడని మళ్ళీ తనని పెళ్లి చేసుకున్నానని ఆవిడ చెప్పగానే అంటే భర్త లేని వాళ్లని టార్గెట్ చేసి పిల్లలను ఏం చేస్తున్నాడని అప్పుకి డౌట్ వచ్చి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ రేణుక భర్తని స్టేషన్ కి తీసుకొని రండి అని వెళ్ళిపోతుంది. మరొకవైపు చేసిన యాడ్ షూట్ వస్తుంది. అది ప్లే చేసుకొని అందరు చూస్తారు. యాడ్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంట్రా యాడ్ ఫెయిల్ అవుతుందన్నావ్.. మరి ఇదేంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రేణుక భర్త అశోక్ ని ఇంటరాగేషన్ చేస్తుంది. అశోక్ భయపడి నిజం చెప్తాడు. నేను చిన్న పిల్లలని వేరే వాళ్ళకి అమ్మేస్తాను.. వాళ్ళ ఆర్గాన్స్ తీసుకుంటారు.. అందుకే రేణుక కూతురిని కిడ్నాప్ చేసాను.. ఆపరేషన్ కి టైమ్ పడుతుందంటే నా దగ్గర దాచానని అశోక్ చెప్పగానే అప్పు అతన్ని కొడుతుంది. ఆ తర్వాత రేణుక వస్తుంది. తనకి వాళ్ళ పాపని అప్పగిస్తుంది.

మీడియా వాళ్ళు వస్తారు. నా పాప దొరికిందంటే కారణం అపూర్వ మేడమ్ అని రేణుక చెప్తుంది. అది న్యూస్ లో రావడం రుద్రాణి చూసి ఇంట్లో వాళ్ళకి చూపిస్తుంది. అప్పుడే అప్పు,కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. నన్ను ఇంత మోసం చేస్తారా.. ఇక అప్పు ఉద్యోగం చెయ్యడానికి వీలు లేదని ధాన్యలక్ష్మి తెగేసి చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య కలిసి ధాన్యలక్ష్మికి అప్పుపై ఉన్న కోపాన్ని పోగొట్టేలా చెయ్యాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.