English | Telugu

యష్మీకి వెన్నుపోటు పొడిచిన ప్రేరణ.. నామినేషన్లో బిగ్ ట్విస్ట్‌ ఇదే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎవరు ఊహించని విధంగా తొమ్మిదవ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో చెత్త రీజన్స్ తో విష్ణుప్రియ నామినేషన్ చేసింది. గౌతమ్, ప్రేరణ, తేజ, నయని, నబీల్‌లను తన కారణాలు చెప్పి నామినేట్ చేసింది విష్ణుప్రియ. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు.

విష్ణుప్రియ నామినేట్ చేసిన వారిలో నుండి సేవ్ చేసే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ప్రతిసారి పోలీస్ సైరన్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్లి జైలు కీ ని పట్టుకుంటారో వాళ్లు జైల్లో ఉన్న ఒక సభ్యుడ్ని విడిపించి.. నామినేషన్స్ నుంచి సేవ్ చేసి బయట ఉన్న సభ్యుల నుంచి ఒకరిని నామినేట్ చేసి జైల్లోకి పంపించాల్సి ఉంటుంది.. ఒకసారి కీ సంపాదించిన సభ్యుడు మరోసారి పట్టుకోవడానికి వీల్లేదు.. మెగా చీఫ్ విష్ణుప్రియను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు.. అలానే విష్ణు ' కీ' కోసం పరిగెత్తకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ముందుగా సైరన్ మోగిన వెంటనే పృథ్వీ కీ తీసుకున్నాడు. వెంటనే నబీల్‌ని సేవ్ చేసి ఆ ప్లేస్‌లో అవినాష్‌ను నామినేట్ చేశాడు.. మీరు స్పీడుగా ఉన్నారు.. తర్వాత కీ తీసుకొని మా వాళ్లను నామినేట్ చేసే అవకాశం ఉంది.. అలానే నా పాయింట్ ఏంటంటే బిగ్‌బాస్ అంటే పిచ్చి అని చెప్పి మీరు బస్తా టాస్కులో వెంటనే గివ్ అప్ ఇచ్చినట్లు అనిపించింది.. అంటూ పృథ్వీ చెప్పాడు. సైరన్ మోగగానే ఈసారి కీ యష్మీ దక్కించుంది. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి హరితేజను నామినేట్ చేసింది. మీ పర్ఫామెన్స్ తగ్గిపోయింది.. ఫైర్ పోయిందంటూ యష్మీ కారణాలు చెప్పింది. ఆ తర్వాత రోహిణి 'కీ' పట్టుకొని అవినాష్‌ను బయటికి తీసుకొచ్చి పృథ్వీ‌ని నామినేట్ చేసి జైలుకి పంపింది.

ఆ తర్వాత అవినాష్ 'కీ' దక్కించుకొని తేజను సేవ్ చేసి.. యష్మీని నామినేట్ చేసి లోపలికి పంపాడు. ఆ తర్వాత ప్రేరణ 'కీ' తీసుకుంది. ఇక అందరు తను యష్మీనే సేవ్ చేస్తుందని అనుకున్నారు. కానీ పృథ్వీని బయటికి తీసుకొచ్చింది ప్రేరణ. ఇది ఊహించని పృథ్వీ.. థాంక్యూ మమ్మీ అంటూ ప్రేరణకి హగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ ప్లేస్‌లో టేస్టీ తేజ‌ను స్వాప్ చేసింది ప్రేరణ. మరో రౌండ్ ఉంటుంది అప్పుడు యష్మీని సేవ్ చేస్తుంది తమ క్లాన్ అని ప్రేరణ అనుకుంది. కానీ ఇంతటితో నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో తనని కాపాడిన యష్మీని సేవ్ చేయలేకపోయానని ప్రేరణ ఏడ్చేసింది. గౌతమ్, నయని, హరితేజ, యష్మీ, టేస్టీ తేజ మొత్తం ఐదుగురు సభ్యులు ఈ వారం నామినేషన్స్‌ లో ఉన్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.