English | Telugu

ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోన్న కొత్త సీరియ‌ల్ 'నేత్ర‌'

నేత్ర అనే కొత్త సీరియల్ జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నరుడికి, నాగినికి మధ్య ప్రేమ గెలిస్తేనే రాక్షస సంహారం జరుగుతుంది ..నాగమణి సొంతమవుతుంది" అనే కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతోంది. ప్రేమ కోసం పగతో నాగిని యుద్ధం చేయబోతోంది. ఇందులో హీరోగా మలయాళ నటుడు ప్రేమ్ జాకబ్ నటిస్తున్నాడు.

బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించిన శివాని తోమర్ ఈ సీరియల్ లో యాక్ట్ చేస్తోంది. ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించిన భరద్వాజ్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నాడు.అత‌ను 'మొగలి రేకులు' సీరియల్ లో ఒక చిన్న నెగటివ్ రోల్ లో నటించాడు. గతంలో 'ప్రతిఘటన', 'ఆడదే ఆధారం' సీరియల్స్ లో నటించాడు.

శ్రీమతి శ్రీనివాస్, అభిషేకం, పద్మవ్యూహం, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో నటించిన జ్యోతి రెడ్డి ఈ సీరియల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. అంజు అస్రాని, ఒకప్పుడు సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న చిన్నా, సీనియర్ యాక్టర్ కృష్ణవేణి, ప్రియాంక, 'మట్టిగాజులు', 'మనసు మమత'సీరియల్స్ లో నటించిన చక్రి, రాధాకృష్ణ, దుర్గాదేవి, శ్రావణి యాదవ్ వంటి వారు కూడా కనిపించబోతున్నారు.

అత్తారింటికి దారేది, అల వెంకటాపురం సీరియల్స్ లో నటించిన ప్రియా తరుణ్ కూడా ఈ సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ జెమినీ టీవిలో ఈ నెలలో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి డేట్, టైం స్లాట్ త్వరలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.