English | Telugu

చూద్దామని వెళ్ళా.. మిస్టర్ మెస్మరైజ్ అవార్డు వచ్చేసింది

గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర మీద దూసుకుపోతోంది. అందులో రిషి, వసుధారా పాత్రలు ఇప్పుడు హైలైట్. సీరియల్ ఐనా కూడా నిజమైన ప్రేమికులేమో అన్నంత బాగా ఆ పాత్రల్లో లీనమై నటించేశారు. ఇక ఇప్పుడు రిషి అలియాస్ ముకేష్ గౌడ తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

"మైసూర్ లో ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా జరిగే అందాల పోటీల్లో ఫ్రెండ్స్ తో సరదాగా చూడడానికి వెళ్లి ఫ్రెండ్స్ ఫోర్స్ మీద పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది . ఐతే ఆ పోటీకి డ్రెస్ కోడ్ ఉంది. దానికి బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకోవాలి. ఐతే అప్పటికి నా దగ్గర ఆ కలర్ లేకపోయేసరికి నా ఫ్రెండ్ అప్పటికే బయటికి వచ్చిన ఒక కంటెస్టెంట్ దగ్గర నుంచి అడిగి తీసుకుని నా పేరు రిజిస్టర్ చేయించేశారు. అప్పుడు ఆ టీ షర్ట్ తీసుకుని రెస్ట్ రూమ్ కి వెళ్ళాను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. నేను రెడీ అవుతున్న టైంకే నా పేరు పిలిచేసారు. ఒక్కసారిగా నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. వెంటనే రెస్ట్ రూమ్ నుంచి నా స్టైల్ లో నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఫైనల్ గా టాప్ 10 లో నా పేరు వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్స్ లో నాకు మిస్టర్ మెస్మరైజ్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన మరో కాంపిటీషన్ కి వెళ్తే బెస్ట్ స్మైల్ అవార్డు ఇచ్చారు.." అంటూ చెప్పాడు రిషి.

ఇంకా "నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అన్నిటిలోకి ఆవు అంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే ఏ జంతువైనా సీరియస్ గా కనిపిస్తుంది ఒక్కసారైనా..కానీ ఆవులో ఆ సీరియస్ నెస్ అస్సలు కనిపించదు.. ఎప్పుడూ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకే గోమాతను పూజిస్తే పుణ్యం అంటారు" అంటూ రిషి ఆవు గురించి తన మనసులో మాట చెప్పాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.