English | Telugu

Biggboss 8 Telugu: బజ్ ఇంటర్వ్యూలో మెహబూబ్ బయటపెట్టిన షాకింగ్ నిజాలివే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది.‌ మెహబూబ్ ఎనిమిదో వారం ఎలిమినేషన్ అయ్యాడు. ఇక బిబి బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు మెహబూబ్.

నీకు దీపావళి అచ్చి రాలేదు అనుకుంటా.. ముందు సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. ఈ సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. దీపావళి నాకు అచ్చురాలేదని అనిపిస్తుందా అని యాంకర్ అడుగగా.. అదేం లేదని మెహబూబ్ అన్నాడు. సీజన్-4లో పది వారాలు ఉన్నావు. చాలా ఫేమ్ వచ్చింది. మళ్లీ ఎందుకు సీజన్ 8కు రావాలనుకున్నావని యాంకర్ అడుగగా.. నేను దీనిని ఒక అవకాశంలాగా చూశాను. ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు తెలియొచ్చు అనుకున్నానని మెహబూబ్ అన్నాడు. తన నామినేషన్స్ గురించి అడిగాడు అర్జున్. మీరు ఈ వీక్ సేఫ్ అయ్యింటే వచ్చేవారం ఎవరిని నామినేట్ చేసేవారు’’ అని అడిగాడు అర్జున్. ‘‘నయని ప్రతీ గేమ్ నేను ఆడతాను అనేది’’ అని కారణంతో సహా తననే నామినేట్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు మెహబూబ్.

టీమ్‌కు కావాల్సిన పాయింట్స్ నేను తెప్పిస్తున్నాను’’ అని గర్వంగా చెప్పాడు మెహబూబ్. ఏ కంటెస్టెంట్ గురించి అడిగినా పాజిటివ్‌గానే ఎందుకు చెప్తున్నావని అడుగగా.. పాజిటివ్, నెగిటివ్ రెండూ చూస్తానని మెహబూబ్ చెప్పాడు. అవకాశం వచ్చాక ఆరుబయట కూర్చున్నాడంట. అవకాశం రాలేదని చెప్పి మంచమెక్కి కూర్చుంటా అన్నాడంట అని అర్జున్ ఓ సామెత చెప్పగానే.. నచ్చలేదనేట్టుగా కనిపించేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు‌ మెహబూబ్. ‌ఇంకా బజ్ ఇంటర్వ్యూ(Biggboss 8 Telugu Buzz) లో హౌస్ లో తనకి ఎవరు బెస్ట్.. ఎవరు వరెస్ట్.. ఎలా ఉంటుందో అన్నీ చెప్పుకొచ్చాడు మెహబూబ్.