English | Telugu

విష్ణుప్రియతో మానస్ ఆటాపాటా

మానస్ నాగులపల్లి ఇప్పుడు బుల్లి తెర మీద ఫేమస్ యాక్టర్. సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, వీడియో అయినా అభిమానులను అలరించే అవకాశాన్ని మానస్ నాగులపల్లి అస్సలు వదులుకోడు. అలాంటి మానస్ త్వరలో విష్ణుప్రియతో కలిసి అలరించబోతున్నాడు. 'జరీ జరీ' అనే జానపద వీడియో సాంగ్ లో కనిపించబోతున్నాడు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్, జడ్జి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే తన లుక్‌ను మానస్ రిలీజ్ చేసాడు. కొన్ని స్పెషల్ టీవీ షోస్ లో కీర్తి కేశవ్ భట్‌తో కలిసి మానస్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్సులు అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా మానస్ మాత్రం డాన్స్ చేసే అవకాశాన్ని అస్సలు వదులుకోడు.

ఇక ఇప్పుడు మానస్, విష్ణుప్రియ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ఆడియన్స్ లో అంచనాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక మానస్ కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే తాను నటించిన వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే బాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మానస్.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.