English | Telugu

డాక్టర్ బాబు మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

'కార్తీక దీపం' సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరను, సోషల్ మీడియాని షేకాడించేసిన సీరియల్ ఇది. ఈ సీరియల్ కి మెయిన్ పర్సన్స్ డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత. వీళ్ళు లేకపోయేసరికి సీరియల్ కి అర్థ‌మే లేకుండా పోయింది. ఇది తెల్సుకున్న డైరెక్టర్ ఇప్పుడు కొత్త కొత్త మలుపులతో సరికొత్తగా మళ్ళీ ఒక్కో పాత్రను ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు వంటలక్క మేకప్ వేసుకుని రీఎంట్రీ ఇచ్చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు బుల్లితెర మీద సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నెగటివ్ రోల్ లో ఉండే మోనిత కూడా మళ్ళీ రావడానికి సిద్ధమౌతోంది.

ఇక డాక్టర్ బాబు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అనౌన్స్ చేసేశాడు. "గెట్ రెడీ ఫోక్స్.. డాక్టర్ ఆన్ డ్యూటీ" అంటూ కాప్షన్ పెట్టి తలకు కట్టు కట్టుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫాన్స్ అంతా ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఈ సీరియల్ ఇప్పుడు ఎలాంటి ట్రాక్ లో నడవబోతోంది అనే విషయం పై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఐతే గతంలో డాక్టర్ బాబు "ఇంక సీరియల్ లోకి మళ్ళీ రాను.. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళైపోయారు కదా. వాళ్లకు తండ్రిగా చేయడం ఇష్టం లేదు" అని తన యూట్యూబ్ ద్వారా తన ఫాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు.

ఐతే ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూండేసరికి కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే, కొంతమంది మాత్రం 'అప్పుడు అలా చెప్పారు, ఇపుడు మళ్ళీ ఏమిటి' అంటున్నారు. ఇక ఈ రీఎంట్రీస్ తో 'కార్తీక దీపం' సీరియల్ రేటింగ్ మళ్ళీ పెరుగుతుందా ఇంతకుముందులా ఆడియన్స్ మళ్ళీ ఈ సీరియల్ ని ఆదరిస్తారా.. వేచి చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.