English | Telugu

Karthika Deepam 2: వేలంపాట నుండి ఆ ముగ్గురు అవుట్.. జ్యోత్స్న ప్లాన్ అదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -480 లో... జ్యోత్స్న వేలంపాటకి వెళ్లడానికి రెడీ అయి వస్తుంది. ఎలాగైనా ఈ వేలంపాటలో నేనంటే ఏంటో తేలుస్తానని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. దశరథ్, శివన్నారాయణ కూడా రెడీ అయి వస్తారు. అప్పుడే కార్తీక్, దీప కూడా వస్తారు. మమ్మీ నన్ను ఆశీర్వదించమని సుమిత్ర దగ్గర జ్యోత్స్న ఆశీర్వాదం తీసుకుంటుంది. కార్తీక్ పదా అని శివన్నారాయణ అనగానే బావ ఎందుకని జ్యోత్స్న అంటుంది. రావాలని శివన్నారాయణ అంటాడు. ఛా బావ ఎందుకు మధ్యలో అని జ్యోత్స్న చిరాకుపడుతుంది.

ఆ తర్వాత సుమిత్ర ఎదురువస్తుంటే అందరు వేలంపాటకి బయల్దేరతారు. అల్ ది బెస్ట్ బావ అని దీప చెప్తుంది. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందని పారిజాతం అనుకొని.. దీప దగ్గరికి వెళ్తుంది. ఏం చేయబోతున్నారు? ఏం చేసినా నా మనవరాలు విజయంతో తిరిగి వస్తుందని పారిజాతం అంటుంది. ఏదైనా సరే మంచి జరగాలని కోరుకునే మనిషిని అని దీప అంటుంది.

మరొకవైపు వేలంపాట దగ్గరికి ముందుగా దశరథ్, శివన్నారాయణ వెళ్తారు. అక్కడ దశరథ్ ఫ్రెండ్ వైరా ఎదరుపడతాడు. వైరా పలకరిస్తే నీలాంటి మోసగాడితో మాట్లాడనని దశరథ్ అంటాడు. ఈ వేలం పాటలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండని దశరథ్ తో వైరా అంటాడు.

ఆ తర్వాత వెనకాలే కార్తీక్, జ్యోత్స్న వస్తారు. హాయ్ జ్యోత్స్న నేను మీ డాడ్ ఫ్రెండ్ ని అని వైరా పరిచయం చేసుకుంటాడు. ఎలాగూ మీ రెస్టారెంట్ లాస్ లో ఉంది.. నాకు అమ్మండి ఇప్పుడు వేలంపాటలో కూడా ఓడిపోతారని వైరా అంటుంటే.. అది జరగదని జ్యోత్స్న అంటుంది. డాడ్ వాళ్ళు ఉంటే నేను అనుకున్నది జరగనివ్వరని.. జ్యోత్స్న తన మనిషి చేత దశరథ్ కి కాల్ చేయించి.. రెస్టారెంట్ లో ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు తనిఖీకి వచ్చారని చెప్పిస్తుంది. దశరథ్ వెళదామని అంటాడు. కార్తీక్ ని కూడా తీసుకొని వెళదామని శివన్నారాయణ అంటాడు. ముగ్గురు అక్కడ నుండి వెళ్తారు. జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరొకవైపు సుమిత్రకి దీప కాఫీ తీసుకొని వస్తుంది. నాకు ఇష్టమైన వంట చెయ్ అని దీపతో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.