English | Telugu

Karthika Deepam 2 : అవార్డు సొంతం చేసుకున్న కార్తీక్.. శివన్నారాయణ కోపం అందుకే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -360 లో... పోలీసులతో జ్యోత్స్న, గౌతమ్ ఇద్దరిపై డౌట్ ఉందని ఇంకొకరిని కనిపెట్టాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంట్లోకి వచ్చాక వాళ్ళని జ్యోత్స్న దగ్గరికి వెళ్లకని చెప్పండి. త్వరగా రెండు కుటుంబాలు కలవాలని అనుకుంటే ఇంకా దూరం అవుతున్నారని దీప అంటుంది. ఇప్పుడు ఏమైనా కలిసి ఉన్నాయా విడిపోవడానికి అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత పోలీసులు శివన్నారాయణ ఇంటికి వెళ్లి కార్తీక్ ఇంట్లో కత్తి దొరికింది. జ్యోత్స్న, గౌతమ్ పై డౌట్ ఉందని చెప్పాడు అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇలా చీటికీ మాటికీ వచ్చి మా ఇంటి ఆడపిల్ల పరువు తియ్యకండని సుమిత్ర అంటుంది. బుల్లెట్ మిస్ అయిన కేసులో కూడా జ్యోత్స్న విచారణకి రావల్సి ఉంటుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు‌. కత్తిపై వేలిముద్రలు ఎవరివో తెలిస్తే అప్పుడు తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్ చెప్పి వెళ్తాడు. అందరు కార్తీక్ పై కోపంగా ఉంటారు. ఎవరు నేరస్తులో తెలుస్తుంది కదా.. అప్పుడు తెలుస్తుందని దశరథ్ అంటాడు.

ఆ తర్వాత అనసూయని శౌర్య ఆటపట్టిస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. కార్తీక్ దగ్గరికి స్వీట్ బాక్స్ తో ఎంట్రీ ఇస్తాడు సత్యరాజ్. బెస్ట్ రెస్టారెంట్ అవార్డు మన రెస్టారెంట్ కి వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్తాడు. కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మా తాత ముందు నిలబడి నేను గెలిచానని చెప్తానని కార్తీక్ గర్వంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.