English | Telugu

కప్పల పెళ్లి కోసం వైజాగ్ సముద్రాన్ని రాసిచ్చిన రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారంలాగే ఈ వారం కూడా అలరించింది. ఇక ఈ ఎపిసోడ్ లో కప్పల పెళ్లి అనే కాన్సెప్ట్ తో కడుపుబ్బా నవ్వించారు. ఆగష్టు వచ్చినా వర్షాలు లేక జనాలు ఎండలతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పల్లెటూళ్లలో కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడతాయని ఒక గట్టి నమ్మకం పూర్వ కాలం నుంచి ఉన్నదే. అదే కాన్సెప్ట్ తీసుకుని మగ కప్పగా నరేష్ ని, ఆడ కప్పగా పవిత్రను పెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీం.

ఇక ఈ కప్పల పెళ్లి మనషుల పెళ్లిలా గ్రాండ్ గా మంచి ఆటాపాటతో చేశారు. అంత్యాక్షరితో పాటు మంచి ఫోక్ సాంగ్స్ కూడా వినిపించారు. రమణ పాడిన ఫోక్ సాంగ్స్ కి స్టేజి అదిరిపోయింది. తర్వాత కండక్టర్ పాప ఝాన్సీ వచ్చి డాన్స్ ఇరగదీసేసింది. అలా కప్పల పెళ్ళికి వచ్చిన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాక చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఫుల్ మస్తీ చేశారు.

ఆడ కప్పుకు రెండు లోతు బావులు, ఒక చెరువు, ఒక నీళ్ల తొట్టెను చదివించాడు హైపర్ ఆది. వైజాగ్ సముద్రాన్ని చదివించేసాడు ఆటో రాంప్రసాద్. వెంకీ మంకీస్ వాళ్ళ ఇంటి వెనక ఉన్న రెండు మురుక్కాలవలు, ఇమ్ము వాళ్ళ తొట్టెలో ఉండే నీళ్లు, ఇంటెనక కాల్వను చదివించాడు రాఘవ. ఇక చదివింపుల కార్యక్రమం పూర్తయ్యాక ఇద్దరి చేతా దండాలు మార్పించి పెళ్లి చేసేసారు. ఇలా ఈ వారం కప్పల పెళ్లి బాగా ఫన్ క్రియేట్ చేసింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.