English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.

మరొకవైపు కాశీ దగ్గరికి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. ఒరేయ్ డ్రైవర్ వెళ్లి చాయ్ తాగి రా అని పారిజాతం అనగానే నేను డ్రైవర్ కాదని కాశీ అంటాడు. మరి ఏం అంటారు రా నువ్వు మీ మామ దగ్గర పనికి చేస్తున్నావ్.. అంత అవసరం ఏముంది రా.. ఏం డబ్బులు కావాలన్నా నన్ను అడగొచ్చు కదా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి ఇక నీ బాగోతం బయటకు రానుంది ఆఫీస్ లో నువ్వు చేసే తప్పుడు లెక్కల గురించి మావయ్య ఒక్కొకటికి బయటకు తీస్తున్నాడని కాశీ అనగానే జ్యోత్స్నకి చెమటలు పడుతాయి. మరొకవైపు అసలు జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డ కాదని అనిపిస్తుంది ఎందుకంటే తన సొంత కంపెనీలోనే చాలా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. వాటికి లెక్కలు కూడా లేవని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. తనే వారసురాలు కదా తనకే కదా ఆస్తులన్నీ మరి చెయ్యాలసిన అవసరం ఏముంది.. తను వారసురాలు కాదని నాకు డౌట్ వస్తుందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇప్పుడు నువ్వు లెక్కలు అన్ని చెప్పి జ్యోత్స్నని తాత ముందు నిలబెట్టగలవా అని కార్తీక్ అనగానే కొంచెం టైమ్ పడుతుందని శ్రీధర్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు. కాశీ మాటలు గుర్తుచేసుకొని టెన్షన్ పడుతారు. అప్పుడే దీప వస్తుంది. డోర్ కొట్టి రావాలని లేదా అని పారిజాతం అనగానే డోర్ వేసి లేదని దీప అంటుంది. అంటే నీ గురించే నువ్వు మొన్నటిలాగా పడిపోతావేమోనని పారిజాతం అనగానే నా బిడ్డ జోలికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని దీప అనగానే గతంలో శౌర్య విషయం లో జ్యోత్స్న తప్పు చేసినప్పుడు దీప కొట్టిన విషయం గుర్తుచేసుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.