English | Telugu

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

మన డిజైన్స్ దొంగతనం చేస్తాడా అని రాజ్ కోప్పడతాడు.‌ ఏవండి ప్లీజ్ ఆగండి.. తర్వాత మాట్లాడుకుందామని కావ్య సర్దిచెప్పుతుంది. ఈ అవార్డు రాజ్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉందని రాహుల్ అంటాడు. ఇక తప్పక రాజ్ వెళ్లి అవార్డు ఇస్తాడు. మరొకవైపు అప్పు గదిలో ఉంది అనుకోని ధాన్యలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. ప్రకాష్ బెడ్ పై పడుకొని ఉంటాడు. అది చూసి హమ్మయ్య అప్పు వచ్చింది అని కళ్యాణ్ అనుకుని అమ్మ నేను అప్పుకి భోజనం ఇస్తాను. నువ్వు వెళ్ళు అని చెప్పగానే ధాన్యలక్ష్మి వెళ్తుంది. పొట్టి ఎప్పుడు వచ్చావని అప్పు అనుకుని ప్రకాష్ తో మాట్లాడుతాడు కళ్యాణ్. ప్రకాష్ మొహం చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు.

మరొకవైపు ఇంత మోసం చేస్తాడా వాడి సంగతి చెప్తానని రాజ్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి చాలా థాంక్స్ రాజ్.. నీ వల్లే రాహుల్ ఇదంతా చేసాడు ఈ గౌరవం దక్కింది అంటే దానికి కారణం నువ్వే అని స్వప్న అనగానే రాజ్ సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో డిజైన్స్ ఎవరు రాహుల్ కి చేరవేశారని రాజ్, కావ్య ఎంప్లాయిస్ ని అడుగుతారు. అది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ డిజైన్స్ చాలా సీక్రెట్ ఎవరికీ తెలియొద్దని చెప్తారు. అది రాహుల్ మనిషి విని డిజైన్స్ తీసుకోబోతుంటే రాజ్, కావ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.