English | Telugu

Jayam serial : ఇంప్రెస్ చేసిన గంగ.. ఇంట్లోకి వచ్చిన తనని రుద్ర అంగీకరిస్తాడా!

జీ తెలుగులోప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14లో..... గంగ సూపర్ మార్కెట్ లో పని చేయకుండా అందరిని డిస్టబ్ చేస్తుందనుకొని తనకి రుద్ర పనిష్మెంట్ ఇస్తాడు. నువ్వు ఒక్కమాట మాట్లాడిన కూడా మాటకి వంద చొప్పున శాలరీ లో నుండి కట్ అవుతుందని గంగతో రుద్ర చెప్తాడు. దాంతో గంగ సైలెంట్ గా ఉంటుంది. పెద్దసారు వచ్చినా కూడా మాట్లాడదు.

ఆ తర్వాత సూపర్ మార్కెట్ కి ఒకవిడ వస్తుంది. ఒక వర్కర్ కస్టమర్ ఒక ఆవిడకి సమాధానం చెప్పకపోవడంతో అందరిపై తను కోప్పడుతుంది. అప్పుడే గంగ వచ్చి తనతో బాగా మాట్లాడుతుంది. గొడవ కాకుండా తనే దగ్గర ఉండి సరుకులు ఇస్తుంది. దాంతో పెద్దసారు.. చూసావా గంగ తన మాటలతో కస్టమర్స్ ని ఎలా డీల్ చేసిందని రుద్రకి చెప్తుంటే రుద్ర సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెద్దసారు గంగ ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అందరికి గంగ ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుందని చెప్తాడు. మరి రుద్రకి ఇష్టం ఉండదు కదా అని ఇంట్లో వాళ్ళు అంటారు. రుద్రకి తెలియకుండా గంగ ఇక్కడ ఉంటుంది. తెలియకుండా మీరే చూడాలని పెద్దసారు అంటాడు. అప్పుడే రుద్ర ఇంట్లోకి వస్తుంటే అందరు గంగ కన్పించకుండా అడ్డుగా ఉంటారు. ఆ తర్వాత రుద్ర పైకి వెళ్ళాక ఇంట్లో అందరిని పెద్దసారు పరిచయం చేస్తాడు.

ఆ తర్వాత నా కోడలు అని పెద్దసారు పరిచయం చేస్తాడు. మరి కొడుకు అని గంగ అనగానే పెద్దసారు కోడలు లోపలికి వెళ్లి ఫోటో పట్టుకొని ఏడుస్తుంది. వెనకాలే పెద్దసారు, గంగ వెళ్తారు. నా కొడుకు చనిపోయాడు. అప్పటి నుండి నా భార్య శకుంతల గదిలో బాధపడుతూ కూర్చొని ఉంటుంది. నువ్వు తనని మారుస్తావని అనుకుంటున్నానని పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో గంగ భోజనం తీసుకొని వెళ్లి శకుంతల డోర్ కొడుతుంది. ఎవరు అని శకుంతల అనగానే భానుప్రసాద్ అని గంగ అనగానే శకుంతల వచ్చి డోర్ తీస్తుంది. భోజనం పట్టుకొని ఉన్న గంగని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.