English | Telugu

పేషెంట్ కి దిష్టి తీసి పంపించిన డాక్టర్! 

జబర్దస్త్ షో ఆడియన్స్ ని తెగ అలరిస్తోంది. మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినా అన్ని సర్దుకుని ఇప్పుడు మళ్ళీ పాత అందం సంతరించుకుంది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా రాబోయే వారం స్కిట్స్ అన్నీ కూడా చక్కగా అలరించబోతున్నాయి. ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఖుష్బూ, ఇంద్రజ, రష్మీ కలిసి గణేశుడి విగ్రహాన్ని స్టేజి మీదకు తెచ్చి పూజ చేసి ప్రసాదాలు పంచేశారు. ఇక తరువాత స్కిట్ లోకి రాఘవ టీం ఎంట్రీ ఇచ్చేసాడు. రాఘవ ఒక చిన్న క్లినిక్ పెట్టి నడుకుంటున్నాడు. "కడుపు నొప్పి వస్తే రండి తీసి పంపించేస్తాను, తలనొప్పి వస్తే రండి తీసి పంపిస్తాను అంటూ అనౌన్స్ చేస్తాడు.

ఇంతలో మోకాళ్ళ నొప్పులతో ఒక పేషెంట్ వస్తాడు. గబగబా వెళ్లి ఎండుమిరపకాయలు ఉప్పు తెచ్చి ఆ పేషెంట్ కి దిష్టి తీస్తాడు. ఇంతలో లోపలి నుంచి రాఘవ భార్య వస్తుంది. ట్రీట్మెంట్ టైంలో ఇక్కడికి రావద్దు అన్నా కదా అని భార్య మీద అరుస్తారు. ఇంట్లో నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఇక్కడ క్లినిక్ లో పెట్టుకుంటే ఇంట్లో వంటెలా చేసేదంటూ అరుస్తుంది.

ఇంతలో ఆ తిట్లను కవర్ చేసుకోవడానికి జడ్జెస్ ఏంటి అంత డల్ గా ఐపోయారని అనేసరికి దృష్టి అంటూ ఖుష్బూ అంటారు . వెంటనే రాఘవ సాంబ్రాణి పట్టుకెళ్లి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి ఎక్స్ట్రా దిష్టి పోవాలి" అంటూ మంచి ఫన్ క్రియేట్ చేస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.