English | Telugu
కిర్రాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్
Updated : Jun 8, 2022
ఆర్పీ జబర్దస్త్ స్టార్టింగ్ లో ఒక వెలుగు వెలిగిన కమెడియన్. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నాడు . ఐతే ఇప్పుడు ఆర్పీ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయి లక్ష్మి ప్రసన్నతోనే ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వివాహం కూడా త్వరలో జరగబోతోందంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ ఎంగేజ్మెంట్ కి జబర్దస్త్ కమెడియన్స్ అంతా రావడమే కాదు అక్కడ కూడా మంచి ఫన్ క్రియేట్ చేసి బాగా ఎంజాయ్ చేశారు.
ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు కంగ్రాట్స్ ఆర్పీ అన్న అంటూ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. మొదట్లో జబర్దస్త్ తర్వాత అదిరింది షో లో మెరిసి మాయమయ్యాడు ఆర్పీ. ఇక తానూ చేసుకోబోయే అమ్మాయి నెల్లూరు కి చెందిన లక్ష్మీప్రసన్న అని తాను ఈవెంట్ మానేజ్మెంట్స్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. వజ్ర కవచధార గోవిందా, ఇదేం దెయ్యం వంటి చిత్రాల్లో కూడా ఆర్పీ నటించాడు.