English | Telugu
వైజాగ్ లో రచ్చ చేసిన రౌడీ రోహిణి టీమ్
Updated : Jun 8, 2022
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫేమస్ కమెడియన్స్ ఐన రోహిణి, పవిత్ర, నరేష్, శాంతిస్వరూప్ అంతా కలిసి వైజాగ్ లో జరిగిన ఒక ఈవెంట్ కి వెళ్లి అటునుంచి అటు బీచ్ కి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. లంచ్ కి డికబాన రెస్టారెంట్ కి వెళ్లి అక్కడి వ్యూని బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నారు. ఈ రెస్టారెంట్ మొత్తాన్ని వీడియో తీసి రోహిణి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది.
తర్వాత కైలాసగిరి రోప్ వేకి వెళ్లారంతా. ఐతే ఇక్కడ అందరికీ ఫుల్ టికెట్ ఉంటుంది కానీ నరేష్ కి హాఫ్ టికెట్టే అంటూ రోహిణి పంచ్ వేసి అందరిని నవ్వించింది. తర్వాత రోప్ వే లో వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసింది టీమ్. తర్వాత కౌబాయ్ క్యాప్స్ పెట్టుకుని సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. ఇంతలో "మీరు రోహిణి గారు కదూ" అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగేసరికి అక్కడి నుంచి కైలాస్ హిల్ కి వచ్చేసింది టీమ్. రిటర్న్ లో రోప్ వే బాక్స్ లో వస్తుండగా ఈ బాక్స్ లో ఏసీ లేదా అంటూ పవిత్ర అడిగేసరికి అంతా ఒక్కసారిగా ఆమె వైపు ఒక ఫన్నీ లుక్ ఇస్తారు. తర్వాత అందరూ ఐస్ క్రీమ్స్ తినేసి బీచ్ కి వెళ్లిపోయారు రోహిణి అండ్ టీమ్.