English | Telugu

`ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`  ఫుల్ సపోర్ట్ విశ్వక్‌సేన్ కే


గెటౌట్ అంటూ టీవీ 9 స్టూడియో నుంచి గెంటివేయ‌బ‌డ్డ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ కు నెటిజ‌న్ ల నుంచి మ‌ద్దుతు పెరుగుతోంది. ఐ స‌పోర్ట్ విశ్వ‌క్ సేన్ అంటూ ట్వ‌ట్ట‌ర్ లో ఈ యువ హీరోకు చాలా మంది నెటిజ‌న్స్ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇదే సంద‌ర్భంగా బ్యాన్ యాంక‌ర్ దేవి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అంతే కాకుండా స‌ద‌రు యాంక‌ర్ పై వ్య‌క్తిగ‌తంగా దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఇదేనా జ‌ర్న‌లిజం అంటే స్టూడియోకి పిలిచి అవ‌మానిస్తారా? అంటూ మండిప‌డుతున్నారు.

ఈ జాబితాలో `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి` క‌స్తూరి చేరింది. న‌టిగా వెండితెర‌పై అల‌రించిన క‌స్తూరి ఇటీవ‌లే `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న ఇంటింటి గృహ ల‌క్ష్మి సీరియ‌ల్ తో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గ‌త కొన్ని నెల‌లుగా ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్ లోకి మ‌రో న‌టి సితార కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు.

ఇదిలా వుంటే తాజాగా విశ్వ‌క్ సేన్ పై టీవీ ఛాన‌ల్ యాంక‌ర్ లైవ్ టిబేట్ కి పిలిచి అవ‌మానించ‌డం గ‌మ‌నించిన క‌స్తూరి దీనిపై మండిప‌డింది. విశ్వ‌క్ సేన్ కు మ‌ద్ద‌తుగా నిలిచింది. నేను హిట్ సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి విశ్వ‌క్ సేన్ ను ఇస్ట‌ప‌డుతున్నాను. ఈ రోజు ఓ వీడియో చూశాను. దాంతో అత‌నిపై మ‌రింత గౌర‌వం పెరిగింది. అస‌లు ఏ ప్రాంక్ చేసినా కూడా రానంత ప‌బ్లిసిటీ టీవి9 క్రియేట్ చేసింది. ఆల్ ది బెస్ట్ సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వ‌క్ సేన్.. నీ కొత్త సినిమా `అశోకవ‌నంలో అర్జున క‌ల్యాణం` చిత్రానికి కూడా ఆల్ ది బెస్ట్` అంటూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విశ్వ‌క్ సేన్ కు మ‌ద్ద‌తుగా నిలిచింది `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి` క‌స్తూరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.