English | Telugu

ఢీ 14: సుధీర్ పోయి సార్థ‌క్ వ‌చ్చె.. ఏం జ‌రిగిందో!?

కావ్య‌శ్రీ విజేత‌గా నిల‌వ‌డం ద్వారా 'ఢీ 13 కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్' స‌క్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అల్లు అర్జున్ గెస్ట్‌గా పాల్గొన్న ఈ ఎపిసోడ్‌కు వీక్ష‌కాద‌ర‌ణ అపూర్వంగా ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ సిరీస్ నెక్ట్స్ సీజ‌న్‌కు ఇప్ప‌టికే మంచి బ‌జ్ న‌డుస్తోంది. లేటెస్ట్ ప్రోమో ప్ర‌కారం వ‌చ్చే 'ఢీ 14' నుంచి సుడిగాలి సుధీర్ త‌ప్పుకున్న‌ట్లు వెల్ల‌డ‌య్యింది. అత‌ని ప్లేస్‌లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థ‌క్ వ‌చ్చాడు. కొంత కాలంగా ఈ పాపుల‌ర్ డాన్స్ షోలో టీమ్ లీడ‌ర్‌గా ఉంటూ వ‌స్తున్న సుధీర్‌ ఎందుకు త‌ప్పుకున్నాడంటూ సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ న‌డుస్తోంది. సుధీర్ ఫ్యాన్స్ అయితే ఈ మార్పును జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ వ‌ల్లే సుధీర్ ఈ షో నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలిసింది.

Also read:"మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి".. జ‌బ‌ర్ద‌స్త్‌కు టాటా చెప్పి ఏడ్చేసిన‌ సుడిగాలి సుధీర్ టీమ్!

మ‌రో టీమ్ లీడ‌ర్‌గా హైప‌ర్ ఆది కొన‌సాగ‌నున్నాడు. ఆ ఇద్ద‌రితో షూట్ చేసిన ప్రోమోను రిలీజ్ చేశారు. యాంక‌ర్‌గా ప్ర‌దీప్ మాచిరాజు ఎప్ప‌ట్లా త‌న స్టైల్ పంచ్‌ల‌తో అల‌రించ‌నున్నాడు. 'ఢీ' మునుప‌టి సీజ‌న్ల‌లో సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ కెమిస్ట్రీ, సుధీర్‌పై ఆది వేసే పంచ్‌లు వీక్ష‌కుల్ని అమితంగా అల‌రించాయి. ఒక‌వైపు ఊపిరి తిప్పుకోనివ్వ‌ని డాన్సులు, మ‌రోవైపు కామెడీతో 'ఢీ' షో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో సుధీర్‌-ర‌ష్మి జోడీకి ఫాలోయింగ్ పెర‌గ‌డంలో ఈ షో బాగా దోహ‌దం చేసింది.

Also read:సోహైల్ ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేశాడు

'ఢీ 14' ప్రోమోలో జ‌డ్జిలుగా ప్రియ‌మ‌ణి, గ‌ణేశ్ మాస్ట‌ర్ మాత్ర‌మే క‌నిపించారు. పూర్ణ క‌నిపించ‌లేదు. ఆమె ఈ సీజ‌న్‌లో కొన‌సాగుతుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది. 15వ తేదీ ప్రారంభ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా ల‌క్ష్య హీరో హీరోయిన్లు నాగ‌శౌర్య‌, కేతికా శ‌ర్మ వ‌చ్చారు. కాగా ఈ సీజ‌న్‌లో నాలుగు విభాగాల్లో పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. జూనియ‌ర్స్‌, లేడీస్‌, జోడీస్‌, ఛాంపియ‌న్స్ అనే విభాగాల్లో ఈ కాంపిటిష‌న్ ఉంటుందని యాంక‌ర్ ప్ర‌దీప్ అనౌన్స్ చేశాడు.

Also read:కొంప‌ముంచిన అషూరెడ్డి చెత్త ఐడియా!

సుధీర్ ప్లేస్‌లో 'ఢీ 14'లో ఎంట‌ర్ కావ‌డంపై అఖిల్ మాట్లాడుతూ, "సుధీర్‌తో ప‌నిచేయ‌డానికి నేనెప్పుడూ ఎదురుచూస్తుంటాను. త‌ను అసాధార‌ణ టాలెంట్ ఉన్నవాడు, స‌హ‌న‌టుడు. ఈ సీజ‌న్‌లో అత‌డిని మ‌నం మిస్స‌వుతున్నాం. అయిన‌ప్ప‌టికీ నాదైన ముద్ర‌వేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. ఈ షోలో నేను ప్లేబాయ్‌లాగా క‌నిపిస్తా. ఈ షోలో నాలోని ఫ‌న్ సైడ్‌ను చూస్తారు" అని చెప్పాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.