English | Telugu

ష‌న్ను - సిరిల‌కు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్

బిగ్‌బాస్ సీజ‌న్ 5 క్లైమాక్స్‌కి చేరింది. వ‌చ్చే వారం ఫైన‌ల్ జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి జ‌రిగిన ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. గ‌త కొన్ని వారాలుగా బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ష‌న్నుల ట్రాక్ ఆడియ‌న్స్‌కి అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సిరి, ష‌న్నుల‌కి ఎక్స్ హౌస్ మేట్ జెస్సీ షాకిచ్చాడు. ఆదివారం ఇంటి స‌భ్యులతో ఒక‌రితో ఒక‌రిని అనుక‌రించే టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ సంద‌ర్భంగా కాజల్ ని అనుక‌రించిన శ్రీ‌రామ్ న‌వ్వులు పూయించాడు.

ఆత త‌రువాత సిరిని స‌న్నీ అనుక‌రించిన న‌వ్వులు కురిపించాడు. ఇక ష‌న్నుని కాజ‌ల్ అనుక‌రించి అదే స్థాయిలో న‌వ్వించింది. ష‌న్ను.. స‌న్నీని అనుక‌రించారు. అయితే ఈ అనుక‌ర‌ణ సంద‌ర్భంగా సోడా వేస్తున్నావుగా అని ష‌న్నుపై పంచ్ లేయ‌డం న‌వ్వించింది. అయితే ష‌న్ను ... స‌న్నీని అనుక‌రిస్తూ త‌నికి తానే గ్రేట్ అనుకుంటుంటే నాగ్ .. ష‌న్ను ఎలా గ్రేట్ ప్ర‌తీ దానికీ అలిగి కూర్చుంటాడంటూ గాలితీసేయ‌డంతో ఇంటి స‌భ్యులు న‌వ్వుల్లో మునిగిపోయారు.

ఇదిలా వుంటే ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తారంటూ కొన్ని వీడియోల‌ని ప్లేచేశారు నాగార్జున‌. ఇందులో జెస్సీ... ష‌న్ను, సిరిల‌కు సీరియ‌స్ గా వార్నింగ్ ఇవ్వ‌డం షాకిచ్చింది. `ష‌న్ను చాలా సిరీయ‌స్‌గా అడుగుతున్నాను..నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ వుందో... వేరే జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? అని షాకిచ్చాడు... ఆ త‌రువాత సిరిని కూడా అదే స్థాయిలో నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. బిగ్బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడ‌టానికి వ‌చ్చావు క‌దా సిరి .. కానీ అది ప‌క్క‌న పెట్టి ఎమోష‌న‌ల్ క‌లెక్ష‌న్ అయిపోతున్నాను. ఇది.. అది.. క‌నెక్ట్ అయిపోతున్నాను అంటున్నావ్ .. ఇది నీకు అవ‌స‌ర‌మా? అని క్లాస్ పీకాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. జెస్సీ మాట్లాడిన తీరు ష‌న్ను ని పోటీలో సిరి వెన‌క్కి లాగేసింద‌ని స్ఫ‌ష్ట‌మ‌వుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.