English | Telugu

టికెట్ టూ ఫినాలే రేస్ నుండి డీమాన్ పవన్ అవుట్.. తనూజ సపోర్ట్ ఎవరికంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం టికెట్ టూ ఫినాలే రేస్ జరుగుతుంది. పోటీదారులు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం. మూడో టాస్క్ ఆడడానికి ఏ ముగ్గురు ఆడుతారో నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో అందరు డిస్కషన్ చేసుకొని సుమన్, డీమాన్, కళ్యాణ్ పేర్లు చెప్తారు. ఇక వీరు ముగ్గురు ఆడగా.. అందులో డీమాన్ గెలుస్తాడు.‌ డీమాన్ తన పక్కనున్నా గడిని పొంది ఎవరితో పోటీపడాలనుకుంటాడో చెప్తాడు. భరణితో పోటీపడాలని అనుకుంటున్నాని బిగ్ బాస్ కి డీమాన్ చెప్తాడు.

డీమాన్, భరణికి బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో భరణి గెలుస్తాడు. సంఛాలక్ గా తనూజ ఉంటుంది. డీమాన్ టాస్క్ లో స్ట్రక్ అవుతాడు. భరణి టాస్క్ ఫినిష్ చేస్తాడు. టాస్క్ అయ్యాక ఎందుకు ఇలా చేసావ్.. ఇలా చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు అని డీమాన్ పవన్ కి టాస్క్ పెట్టి చూపిస్తుంది. భరణి టాస్క్ గెలిచినందున డీమాన్ గడులని భరణి సొంతం చేసుకుంటాడు.

పవన్ టికెట్ టూ ఫినాలే టాస్క్ నుండి తొలగింపపడుతాడు. దాంతో డీమాన్ పవన్ ఏడుస్తాడు. టికెట్ టూ ఫినాలే రేస్ నుండి సంజన, తనూజ, డీమాన్ తొలగించబడ్డారు. మిగతా అయిదుగురు ఇంకా రేస్ లో ఉన్నారు. టికెట్ టూ ఫినాలే ఎవరు దక్కించుకున్నారో తెలియాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.