English | Telugu

`కార్తీక దీపం` డైరెక్ట‌ర్ కు జ‌నం శాప‌నార్ధాలు

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలం క్రితం టాప్ లో ట్రెండ్ అయిన ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుంది. తెలుగు సీరియ‌ల్స్ ల‌లో టాప్ రేటింగ్ ని సాధించిన ఇండియా వైడ్ గా ట్రెండ్ అయిన ఈ సీరియ‌ల్ గ‌త కొంత కాలంగా గాడి త‌ప్పి అవ‌స్థ‌లు ప‌డుతోంది. సాగ‌దీత ధోర‌ణితో ఎపిసోడ్ ల‌ని డైరెక్ట‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు సాగ‌దీస్తూరు వున్నాడు. దీంతో ఆద‌రించిన వారే ఈ సీరియ‌ల్ పై సెటైర్లు వేయ‌డం మొద‌లైంది. దీంతో టాప్ లో వున్న సీరియ‌ల్ కాస్తా కింద‌ప‌డిపోయింది.

డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క క‌లిస్తే బాగుండు అనుకుంటూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్ట‌ర్ కాపుగంటి రాజేంద్ర అక్క‌డి నుంచే సీరియ‌ల్ ని గాడి త‌ప్పించాడు. దీంతో ఆస‌క్తి పూర్తిగా పోయింది. ఎలా న‌డిపించాలో అర్థం కాక త‌న‌కు తోచిన‌ట్టుగా న‌డిపించ‌డం మొద‌లుపెట్టాడు అదే ఈ సీరియ‌ల్ ప‌త‌నానికి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. ఫ్యామిలీకి డాక్ట‌ర్ బాబు, దీప‌ల‌ని దూరం చేసి న‌డిపించిన డైరెక్ట‌ర్ ఆ త‌రువాత మ‌ళ్లీ క‌లిపి ముందుకు సాగించాల‌నుకున్నాడు. అయితే ఆస‌క్తి పోయింది.

Also Read:అత‌డితో మ‌రోసారి నయ‌న్ రొమాన్స్!

ఇప్పుడు ఉన్న‌ట్టుండి డాక్ట‌ర్ బాబు, దీప‌, హిమ‌ల క్యారెక్ట‌ర్ ల‌ని ఎండ్ చేసేశాడు. చిక్‌మంగ‌ళూర్ ఎపిసోడ్ అంటూ మొద‌లుపెట్టి అక్క‌డే హిమ అత్యుత్సాహం కార‌ణంగా కారు యాక్సిడెంట్ కి గురికావ‌డం.. ఈ ముగ్గురితో స‌హా లోయ‌లో ప‌డి పేలిపోవ‌డం చూపించారు. క‌ట్ చేస్తే ఈ ముగ్గురి ఫొటోల‌కి దండేయ‌డంతో షాక్ కు గురైన వీక్ష‌కులు, మ‌హిళా ప్రేక్ష‌కులు ఇప్పుడు డైరెక్ట‌ర్ పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ఎంత ప‌ని చేశావు డైరెక్ట‌రూ చివ‌రికి వీళ్ల‌ని చంపేసి సీరియ‌ల్ కి ఎండ్ కార్డ్ వేయాల‌నుకున్నావా? అని శాప‌నార్థాలు పెడుతున్నారు.

ఇది నిజంగా నిజ‌మేన‌ని చూపిస్తాడా? లేక ట్విస్ట్ ఇచ్చి సౌంద‌ర్య డ్రీమ్ గా క‌వ‌ర్ చేస్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ముగ్గురి ఫొటోల‌కు దండేసిన సీన్ చూసిన ప్రేక్ష‌కులు మాత్రం డైరెక్ట‌ర్ పై విరుచుకుప‌డుతున్నారు. ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.