అతడితో మరోసారి నయన్ రొమాన్స్!
on Mar 8, 2022

ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న కథానాయికల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. తమిళంలో `కాత్తు వాక్కుల రెండు కాదల్`, `కనెక్ట్`, జీకే విఘ్నేశ్ డైరెక్టోరియల్.. తెలుగులో `గాడ్ ఫాదర్`, హిందీలో షారూక్ ఖాన్ - అట్లీ కాంబో మూవీ, మలయాళంలో `గోల్డ్` చిత్రాలు చేస్తోంది నయన్. వీటిలో మూడు సినిమాలు త్వరలోనే బాక్సాఫీస్ ముంగిట సందడి చేయనున్నాయి.
Also Read: మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్.. తగ్గేదేలే
ఇదిలా ఉంటే, తాజాగా నయనతార మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. `జయం` రవి కథానాయకుడిగా కోలీవుడ్ కెప్టెన్ ఐ. అహ్మద్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ ని రూపొందించనున్నారు. ఈ తమిళ చిత్రంలో రవి మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా, అతని లవ్ ఇంట్రస్ట్ గా ఎంటర్టైన్ చేయనుంది నయన్. అంతేకాదు.. కాఫీ షాపు నడిపే ఓ అమ్మాయి పాత్రలో నయన్ దర్శనమివ్వనుందట. కాగా, ఇదివరకు బ్లాక్ బస్టర్ మూవీ `తని ఒరువన్` (మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `ధృవ`కి మాతృక)లో `జయం` రవి, నయనతార జోడీగా నటించారు. మరి.. ఏడేళ్ళ తరువాత మరోసారి రొమాన్స్ చేయనున్న ఈ జోడీ.. ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



