English | Telugu
శేఖర్ మాస్టర్ అంతలా మోసపోయాడా!?
Updated : Aug 8, 2022
శేఖర్ మాస్టర్ స్మాల్ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఢీ షోకి జడ్జిగా చేసాడు. వెండి తెర మీద స్టార్ హీరోస్ కి కోరియోగ్రఫీ చేస్తూ అద్భుతమైన స్టెప్పులు వేయిస్తూ ఫుల్ బిజీ ఐపోయాడు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే ఏ డాన్స్ ఐనా హిట్టే. అలా స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అని తేడా లేకుండా, యూట్యూబ్ పెట్టి మూడు చేతులా సంపాదించేస్తున్నాడు. ఐతే ఎంత కష్టపడి సంపాదించినా కొన్ని సార్లు తెలిసిన వారి చేతిలోనే మోస పోతాం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు.
కష్టపడిన సొమ్ము పొతే ఆ బాధ ఎవరూ తీర్చలేదని చెప్పుకొచ్చారు. తనకు తెలిసిన ఒక వ్యక్తి అతనికి తెలిసిన వాళ్ళను పరిచయం చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో ఒక అద్భుతమైన స్థలం ఉందని..దానికి మంచి రేట్ ఉందని, రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసరికి తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పు తెచ్చి మరీ డబ్బు మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టాడట శేఖర్ మాస్టర్. అదే టైంలో కరోనా, లాక్ డౌన్ వచ్చేసరికి ల్యాండ్ ని అమ్మేద్దామని వాళ్లకు చెప్పాడట శేఖర్.
ఇక వాళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించేశారట. రేట్ లేదని ఇప్పుడు అమ్మొద్దని..వెయిట్ చేయమని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ రెండేళ్లు గడిపేసి ఇప్పుడు అసలు ఫోన్ కూడా తియ్యడం లేదని జీవితంలో ఇదో పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకొచ్చాడు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బు ..అమ్మా నాన్నలు సంపాదించింది ఏమీ లేదు..అంత కస్టపడి కూడబెట్టుకున్నది నేనే అంటూ ఎమోషన్ అయ్యాడు శేఖర్ మాస్టర్.