English | Telugu

అనసూయను ముద్దు అడిగిన చలాకి చంటి!

ఒకరి తర్వాత తర్వాత జబర్దస్త్ షోని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళను చూస్తుంటే షో పరిస్థితి ఏమిటా అనే ఆలోచన ఆడియన్స్ కి వచ్చింది. ఐతే ఇప్పుడు ఈ షో మాత్రం కొంచెం కొంచెం గాడిన పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే చలాకీ చంటి టీం, రాకెట్ రాఘవ టీం ఈ షోకి ఇప్పుడు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ఇక ఇప్పుడు ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో చలాకి చంటి చిన్నపిల్లాడి వేషంలో వచ్చి ఈ స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. కొమరం ఛాతికి తల్లి పాత్రలో కనిపిస్తుంది.

"అమ్మా నన్ను ఎత్తుకోమని ఆ ఆంటీకి చెప్పవా" అంటూ అనసూయ వైపు చూపిస్తాడు."నీ పిల్లలనైతే ఎత్తుకుని తిరుగుతావు.. నా పిలగాడికి ఎత్తుకోవడానికి ఏమైందమ్మా, అందంగా లేడా నా పిలగాడు" అంటూ నిష్ఠూరంపోతుంది కొమరం. "గాడిదలా పెరిగాడు చూడు" అంటూ కౌంటర్ ఇస్తుంది అనసూయ. "ఒక ముద్దు పెట్టమని చెప్పవా అంటీని" అని మళ్ళీ అడుగుతాడు చలాకీ చంటి. "ఇలాగేనా నీ కొడుకుని పెంచేది" అంటూ అనసూయ సీరియస్ అయ్యేసరికి కొమరం.. చంటిని కొట్టి "స్కిట్ నీ కోసం రాసుకున్నావా, ఆ పిల్ల కోసం రాసుకున్నావా" అంటూ గడ్డి పెడుతుంది.

ఇక లాస్ట్ లో రాఘవ, ఆయన కొడుకు మురారి కలిసి "అదుర్స్" మూవీలోని బ్రహ్మానందం కామెడీ బిట్ ఆధారంగా వేసిన స్కిట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అలాగే వెంకీ మంకీస్ వేసిన దశావతారం స్కిట్ కూడా మంచి టైమింగ్ ఉన్న కామెడీని అందించింది. ఇలా ఈ వారం జబర్దస్త్ షోలో స్కిట్స్ అన్నీ కూడా ఆడియన్స్ ని అలరించబోతున్నాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.