English | Telugu

Ramya Moksha Remuneration: రమ్య మోక్ష రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. అయితే తన ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. నెగెటివ్ టాక్ తో హౌస్ లోకి వెళ్ళిన రమ్య అంతే నెగెటివ్ తో బయటకొచ్చేసింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా వచ్చిన రమ్య మోక్ష సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు వారానికి రెండు నుండి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఆమె రెండు వారాలు హౌస్‌లో ఉన్నందుకు గానూ తను నాలుగు నుండి ఆరు లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇది చాలా ఎక్కువ అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్ లో ఎవరితోను బాండింగ్స్ పెట్టుకోకూడదని సింగిల్ ఎజెండాతో వెళ్ళి, హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ గా గేమ్స్ ఆడి, చివరికి సింగిల్ గా బయటకొచ్చేసింది. ఆయితే రమ్య మోక్ష ఫస్ట్ వీక్ ఏ బయటకొచ్చేసేది కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఫస్ట్ వీక్ నుండి సేవ్ చేసాడు బిగ్ బాస్. వారికి ఉన్న స్పెషల్ పవర్స్ వల్ల వారు హౌస్ లో సర్వైవ్ అవుతున్నారు లేదంటే అందరు నామినేషన్లోకి వచ్చేవారు.

హౌస్ లో‌ మాధురితో ఎక్కువగా ఉన్న రమ్య మోక్ష.. తన నుండి బాండింగ్(బంధం) కోరుకుంది. కానీ మాధురి తనకు దూరంగా ఉండి తనూజకి దగ్గరైంది. అలా మాధురి తనతో ఉండకుండా తనూజకి దగ్గరగా ఉండటం తీసుకోలేకపోయింది. చివరికి తనూజని నామినేట్ చేసి.‌. చెత్త రీజన్లు చెప్పి అందరి దృష్టిలో బ్యాడ్ అయింది. ఇక ఆడియన్స్ ఎవరు కూడా రమ్య మోక్షకి ఓట్లు వేయలేదు ఎందుకంటే హౌస్ లో శ్రీనివాస్ సాయి పెద్దగా ఆడట్లేదు.‌ అతని వల్ల కంటెంట్ కూడా ఏం లేదు.‌. అతనే ఎలిమినేషన్ అవ్వాల్సింది కానీ నెగెటివ్ టాక్ ఎక్కువగా తెచ్చుకున్న రమ్య మోక్ష మరింత నెగెటివ్ తెచ్చుకొని ఆడియన్స్ ఓటింగ్ లేక బయటకొచ్చేసింది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.