English | Telugu

హోమ్ ఐసొలేష‌న్‌లో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు.. ఫైన‌ల్ లిస్ట్ ఇదేనా?

రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5న ప్రారంభం కావ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వ‌రుస‌గా మూడోసారి హోస్ట్ బాధ్య‌త‌ల‌ను అక్కినేని నాగార్జున నిర్వ‌ర్తించ‌నున్నారు. కొవిడ్ ప‌రిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కంటెస్టెంట్ల‌కు ఇప్ప‌టికే టెస్టులు నిర్వ‌హించారు. వారంతా ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని స‌మాచారం.

గ‌త ఏడాది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు కంటెస్టెంట్ల‌ను హైద‌రాబాద్‌లోని ఓ స్టార్ హోట‌ల్‌లో క్వారంటైన్‌లో ఉంచిన నిర్వాహ‌కులు ఈసారి ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారిని ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా కోరారు. గ‌త కొన్ని వారాలుగా బిగ్ బాస్ 5 హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవ‌ర‌నే దానిపై అనేక ఊహాగానాలు వెలువ‌డుతూ వ‌స్తున్నాయి. చాలామందికి తెలిసిన ముగ్గురు సెల‌బ్రిటీలు యాంక‌ర్లు ర‌వి, వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్, యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ మాత్రం హౌస్‌లోకి ఖాయంగా వెళ్ల‌నున్నారు.

వీరు కాకుండా కొరియోగ్రాఫ‌ర్లు ర‌ఘు, ఆనీ, న‌ట‌రాజ్‌, ఆర్జే కాజ‌ల్‌, వీజే లోబో, సిరి హ‌న్మంత్‌, ఆట సందీప్‌, న‌టి శ్వేతావ‌ర్మ పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఇషా చావ్లా, టీవీ న‌టి న‌వ్య స్వామి పేర్లు కూడా రంగంలో ఉన్న‌ప్ప‌టికీ అది కేవ‌లం స్పెక్యులేష‌నే అంటున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.