English | Telugu

హౌస్‌లో సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన 'బిగ్ బాస్'!

ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియకు బిగ్ బాస్ కొత్త దారి ఎంచుకున్నాడు. పవర్ రూమ్‌లోకి ఇద్ద‌రు స‌భ్యులను పంపించాడు. అక్క‌డ వాళ్ల‌కు రెండు లెట‌ర్లు ఉంటాయి. ఆ లెట‌ర్లు ఎవ‌రికి వ‌చ్చాయో.. వారి పేర్లు కూడా ఆ లెట‌ర్స్ మీద ఉంటాయి. ఒక‌రికి లెట‌ర్ ఇవ్వాలి. మ‌రొక‌రి లెట‌ర్ చించేయాలి. ఎవ‌రి లెట‌ర్ చించేస్తే... వారు నామినేట్ అయిన‌ట్టు. దీని వల్ల హౌస్‌లో సభ్యుల మధ్య కొంత గ్యాప్ ఏర్పడటానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. గ్యాప్ ఏర్పడటం కాదు... నిజంగా ఏర్పడిందని చెప్పాలి.

ఉదాహరణకు... షణ్ముఖ్-రవి పవర్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు విశ్వ-సిరికి లెటర్స్ వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత తనకు లెటర్ ఇవ్వమని ఏడుస్తూ సిరిని రిక్వెస్ట్ చేశాడు విశ్వ‌. అప్పుడు 'తీస్కో' అని సిరి ఎమోషనల్ అయ్యింది. అది సోమవారం ఎపిసోడ్ సంగతి. మంగళవారం ఎపిసోడ్ కి వస్తే... సిరితో 'విశ్వ చాలా సెల్ఫిష్' అని షణ్ముఖ్ అన్నాడు. లెటర్ టాస్క్ విషయంలో విశ్వ ప్రవర్తన తనకు నచ్చలేదని అన్నాడు. అప్పుడు సిరి మాట్లాడుతూ "విశ్వకు నామినేషన్స్ అంటే భయం. లెటర్ మీద 'నా సిరి' అని చూసిన తర్వాత వదులుకున్నాను. కొడుకు పేరు చెప్పడంతో వదిలేశా" అని చెప్పింది.

నామినేషన్స్ సమయంలో సిరి, షణ్ముఖ్ లెటర్స్ అందుకోలేదు. కానీ, వాళ్లకు ఏం లెటర్స్ సెండ్ చేశామనేది... హౌస్ బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో లెటర్స్ లో ఏముందనేది ప్రేక్షకులకు తెలిసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.