English | Telugu

బిగ్‌బాస్ : ఎన్ని జ‌న్మ‌లెత్తినా ర‌వి గుంట‌న‌క్కేనా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ‌త సీజ‌న్‌ల‌కు మించి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. కంటెస్టెంట్‌ల వ్య‌వ‌హార శైలి..హోస్ట్‌గా నాగ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల నెటిజ‌న్స్ తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. శ‌నివారం ఎపిసోడ్ విష‌యంలో అయితే కింగ్ నాగ్ మ‌రీ దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌యార‌ని.. సిరిని మంద‌లించ‌కుండా ప్రొటెస్ట్ చేసుకున్న స‌న్నీనే నిందించ‌డం మ‌రీ దారుణంగా వుందని.. గిల్టీ బోర్డ్‌ని స‌న్నీకి త‌గిలించ‌డం మ‌రీ బిగ్‌బాస్ ఏ స్థాయికి వెళ్లింద‌నే విష‌యాన్ని స్ప‌ష్టంచేస్తోంద‌ని మండిడుతున్నారు.

ఇదిలా వుంటే ఈ సోమ‌వారం అంటే 11వ వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ మొద‌లైంది. ప్ర‌తీ సోమ‌వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ కార‌ణంగా షో ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌కు ట్విస్ట్‌ల‌కు తెర‌లేప‌డం తెలిసిందే. ఈ వారం కూడా అదే త‌ర‌హా ర‌చ్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స‌న్నీ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. త‌న‌కి గిల్టీ బోర్డ్ త‌గిలించ‌డం ప‌ట్ల కాజ‌ల్, మాన‌స్ ద‌గ్గ‌ర బాధ‌ని వ్య‌క్తం చేసిన స‌న్నీ .. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ త‌ర‌హాలో ఇంటి స‌భ్యుల‌కు త‌న‌దైన స్టైల్లో పేర్లు పెట్టాడు.

ఆనీ మాస్ట‌ర్ ఖ‌చ్చితంగా పాము అని చెప్పిన స‌న్నీ .. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అన్న‌ట్టు ర‌వి నిజంగా గుంట‌న‌క్కే అని తేల్చేశాడు. ఇక సిరి క‌ట్ల పాము అని ష‌ణ్ముఖ్ న‌ల్ల న‌క్క అని చెప్పిన స‌న్నీ...ఇక త‌న‌కు తాను పేరు పెట్టుకోవాలంటే చింపాజీన‌ని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే నెటిజ‌న్స్ మాత్రం స‌న్నీని బిగ్‌బాస్ టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా అర్థ్ర రాత్రి బాత్‌రూమ్‌లో దూరి గ‌బ్బు ప‌నులు చేసిన వారికి గిల్టీ బోర్డ్ ధ‌రించ‌లేద‌ని... కోట్ల మంది చూస్తుండ‌గా ఫ్రెండ్షిప్ పేరుతో ఒకే దుప్ప‌ట్లో దూరి ముద్దులు.. హ‌గ్గుల‌తో రెచ్చిపోయినవారికి ఎలాంటి బోర్డ్‌లు త‌గిలించ‌లేద‌ని.. కాజ‌ల్‌ని హేళ‌న చేసిన వాళ్ల‌కి.. త‌ల్లిపై ఒట్టుపెట్టి ప‌చ్చి అబ‌ద్ధాలు ఆడిన ర‌వికి ఎలాంటి బోర్డ్‌లు వేయ‌లేద‌ని.. మ‌రి స‌న్నీకే ఎందుకు గిల్టీ బోర్డ్ వేశారో జ‌నం చూస్తున్నార‌ని నెటిజ‌న్స్ బిగ్‌బాస్ తీరుపై మండిప‌డుతున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.