English | Telugu

యష్మీ ఫ్లిప్పింగ్ స్టార్.... నాగార్జున ముందే నిజాలు బయటపెట్టిన ఫ్యాన్!

బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం వీకెండ్ వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చాడు. అందులోను కన్నడ బ్యాచ్ కి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది.‌ ముఖ్యంగా యష్మీకి గట్టిగా క్లాస్ పీకాడు నాగ్ మామ. యష్మీ కన్నడ కుట్టి.. తన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం అభినయంతో పాటు టాస్క్ లలో తనదైన శైలిలో దూసుకుపోతుంది కానీ ఈ అమ్మడు ప్లస్ పాయింట్ ల తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. తనకి నచ్చిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. తనకి నచ్చని వాళ్ళు ఉంటే కన్నెత్తి అయిన చూడదు.

హౌస్ లో యష్మీ తనకంటూ ఒక స్కోప్ క్రియేట్ చేసుకుంది. అందులో నిఖిల్, ప్రేరణ, పృథ్వీలు మాత్రమే ఉంటారు. మిగతా హౌస్ మేట్స్ తో ఒకరకమైన అటిట్యూడ్ తో ఉంటుంది. గత వారం నుండి ఈ అమ్మడు నిఖిల్ తో ప్రేమాయణం కూడా నడిపిస్తుంది. టాస్క్ లో అయితే తన డెసిషన్ అనేది స్టేబుల్ గా ఉండదు. ఈ వారం జరిగిన టాస్క్ లో యష్మీ, ప్రేరణ గౌతమ్ ముగ్గురు ఒక టీమ్ కాగా అందులో ఒకరు టాస్క్ నుండి బయటకు వెళ్ళాలని బిగ్ బాస్ చెప్పగా యష్మీ, ప్రేరణ ఇద్దరు కలిసి గౌతమ్ ని తొలగిస్తారు. అదే విషయం నాగార్జున యష్మీని అడుగుతాడు. సర్ తను మెగా చీఫ్ అయినప్పుడు అడినంత కసిగా ఇప్పుడు ఆడట్లేదు అందుకేనని యష్మీ చెప్తుంది. అప్పుడే గౌతమ్ రియాక్ట్ అవుతు.. సర్ నన్ను తీసిసేటప్పుడు నాకు ఇది చెప్పలేదు. నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావ్ కదా మాకు ఛాన్స్ రావాలని అంటున్నానని అంది అని గౌతమ్ అంటాడు.

అంటే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.. మీకే చెప్పాను తనకి అది చెప్పానని యష్మీ అనగానే అంటే హౌస్ లో ఒక్కొక్కరికి ఒక్కోలాగా చెప్తావా.. అందుకే నిన్ను ఫ్లిప్ యష్మీ అంటున్నారని స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ని అడుగుతాడు నాగార్జున. యష్మీ గురించి ఏం అనుకుంటున్నారు చెప్పండి అని ఒక ఆడియన్ ని అడుగగా.. ఎక్కువ ఫ్లిప్ చేస్తుంది యష్మీ.. తను తప్పని అనగానే వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తుంది యష్మీ. ఇదిగో ఇదే వద్దని నాగార్జున చెప్తాడు.. నీకు ఏడుపు వస్తున్నప్పుడు.. నువ్వు తప్పు చేసినట్టే.. ఆ సిచువేషన్ లో ప్లిప్ అవ్వకుండా ఉండమని నాగార్జున సలహా ఇస్తాడు. మరి నిజంగా యష్మీ ప్లిప్ అవ్వకుండా ఉండగలదా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.