English | Telugu

Maryadha manish eliminated : బిగ్‌బాస్‌ నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌!

బిగ్ బాస్ సీజన్-9(Bigg boss 9 Telugu) రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటివారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్లలో మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డీమాన్ పవన్, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, మరియు భరణి ఉన్నారు.

ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరిని సేవ్ చేయలేదు నాగార్జున. నిన్నటి సండే ఎపిసోడ్ లోనే అందరిని సేవ్ చేసి చివరి వరకు ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్ ని ఉంచారు. అయితే కామనర్ గా వచ్చిన మర్యాద మనీష్ కి ఓట్ బ్యాకింగ్ అంతగా లేదు. పైగా అతని ఆటతీరు కూడా పెద్దగా కనపడలేదు. అయితే ఫ్లోరా సైనీ ఫస్ట్ వీక్ ఓటింగ్ లో ఉండటం, ఈ వీక్ లో ఉండటం తనకి కలిసొచ్చింది. అందుకే మర్యాద మనీష్(Maryadha manish) కన్నా అత్యధిక ఓట్లు పడ్డాయి. సుమన్ శెట్టి(Suman Shetty) రెండు వారాలు నామినేషన్లో‌ ఉండటం మరియు అతనికి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండటంతో అతను అత్యధిక ఓటింగ్ తో‌ నెంబర్ వన్ లో నిలిచాడు.

ఇక సండే ఫన్ డే అంటు కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిస్తూ, ఆటలు ఆడిస్తూ, మధ్య మధ్యలో నామినేషన్ లో ఉన్నవాళ్ళని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చివరికి ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్‌ మిగిలారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్తారని అందరిలో ఉత్కంఠ పెరిగింది. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఫ్లోరా సైనీ సేఫ్ అయ్యింది. దీంతో మనీష్ బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.