English | Telugu

నబీల్ : నేను డబ్బుల కోసం రాలేదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలని గెలుచుకున్నాను 

బిగ్‌బాస్ సీజన్-8 లో‌ నిఖిల్, గౌతమ్ ల తర్వాత నబీల్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. వైల్డ్ కార్డ్స్ రాకముందు నబీల్ ఆటతీరు వేరె లెవెల్ ఉండేది కానీ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక వాళ్ళు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంతో నబీల్ కి స్క్రీన్ స్పేస్ తగ్గింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టాప్-3 పొజిషన్‌లో నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని ఆశతో ఉన్న నబీల్‌కి చివరికి మూడో స్థానమే మిగిలింది. అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నబీల్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

హీరో, తమిళ్ బిగ్‌బాస్ హోస్ట్ అయిన విజయ్ సేతుపతి, మలయాళ నటి మంజు వారియర్ ఇద్దరూ బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. వారి కొత్త సినిమా విడుదలై పార్ట్ 2 డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ జోడీ వచ్చింది. ఇక వచ్చీ రాగానే నాగార్జునతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి చాలా ఆనందపడ్డారు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నాగార్జున సార్‌ని లైవ్‌గా చూస్తున్నా.. చాలా అందంగా ఉన్నారంటూ విజయ్ చెప్పారు. ఇక మంజు వారియర్‌ని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేస్తూ.. సౌత్‌లో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు కానీ మంజు వారియర్ లేడీ సూపర్ స్టార్ అంటూ నాగార్జున చెప్పాడు.

విజయ్ సేతుపతి, మంజు వారియర్ కలిసి హౌస్‌ లోపలికి వెళ్లి నబీల్‌ని మూడో స్థానంలో బయటికి తీసుకొచ్చారు. అయితే తనని తీసుకురావడనికి విజయ్ సేతుపతి రావడం నబీల్‌కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ సేతుపతితో పాటు స్టేజ్ మీదకి వచ్చేసిన నబీల్.. తనకి ఓటేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెప్పాడు. బ్రీఫ్ కేస్ తీసుకోలేదని బాధపడుతున్నావా నబీల్ అని నాగార్జున అడిగితే.. నేను డబ్బుల కోసం రాలేదు సర్.. నాకు ఏ మాత్రం బాధలేదు. ఒకవేళ బాధ ఉండి ఉంటే.. నా ముఖంలో కనిపించేది.. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలు గెలవాలనుకున్నాను.. అది గెలిచానంటూ నబీల్ చెప్పాడు. ఇక విజయ్ సేతుపతి, మంజు వారియల్ వెళ్లిపోతుంటే ఓ రిక్వెస్ట్ చేశాడు నబీల్. వాళ్లంతా కుళ్లుకునేలా ఓ కిస్ ఇవ్వండి సార్ అంటూ నబీల్ అడిగితే విజయ్.. నబీల్‌కి బుగ్గ మీద ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన ఫ్యాన్స్‌కి విజయ్ సేతుపతి ఇలా ముద్దు పెట్టి తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.