English | Telugu

గేమ్ ఛేంజర్ సీన్ లీక్ చేసిన రామ్ చరణ్.. గంగవ్వ తిట్టిందంట!


బిగ్ బాస్ సీజన్-8 వందరోజులు గడిచినా రానీ క్రేజ్ ఫైనల్ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అయ్యప్ప స్వామి మాలలో వచ్చి‌న రామ్ చరణ్ హుందాగా మాట్లాడారు. రామ్ చరణ్ ని చూసి బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యరు.

ఇక హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని నాగార్జున పరిచయం చేస్తుంటే.. అందరి గురించి రామ్ చరణ్ మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక గంగవ్వని నాగార్జున పరిచయం చేస్తుండగా.. గంగవ్వ తెలుసు సర్.. గంగవ్వ ఛేంజర్‌లో ఇద్దరూ కలిసి చేశాం.. చాలా గట్టిగా తిట్టారు నన్ను.. మీ ఉద్యోగం సరిగా చేయడం లేదు సర్..మా పేదోళ్లకి ఏమైనా చేయండని.. అంటూ చరణ్ అన్నారు. అయితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ కలెక్టర్‌ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గంగవ్వ తిట్టిందని అన్నారు కాబట్టి కలెక్టర్ సరిగా పనిచేయడం లేదని తిట్టుంటుంది గంగవ్వ. ఇలా గేమ్ ఛేంజర్‌లో ఓ సీన్‌ని తెలీకుండానే లీక్ చేశారు గేమ్ ఛేంజర్. అలానే రోహిణి గారిని కూడా సెట్‌లోనే కలిశామంటూ చెర్రీ చెప్పారు. ఇక టేస్టీ తేజ లేచి చరణ్ సినిమాలు, నటన గురించి చెబుతూ మిమ్మల్ని మొదటి సినిమా నుంచి చూస్తున్నా సార్.. మీరు ఇలానే ఇంకా ఇంకా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలంటూ తేజ అన్నాడు. దీనికి తేజ మీది కూడా ఫస్ట్ షో అల్లు శిరీష్‌ నుంచి చూస్తున్నా.. అంత టెప్టింగ్‌గా ఉంటుంది.. మీ షో.. అంటూ చరణ్ ప్రశంసించారు.

ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్‌లో ఉండగా శంకర్ సర్ నుంచి కాల్ వచ్చింది.. అసుల కాల్ రాగానే ఇంతకంటే మంచి విషయం ఏముంటుందని ఓకే చేసేశాను.. ఆయన చాలా వర్క్ హాలిక్.. పనిచేయడం కాస్త టార్చర్ అయినా కెరీర్‌కి చాలా బూస్ట్ ఇస్తుందంటూ చరణ్ అన్నారు. గేమ్ ఛేంజర్ చాలా మంచి సినిమా. ఓ మంచి మాస్ పొలిటికల్ డ్రామా. శంకర్ సార్ వింటేజ్ పొలిటికల్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ కగలుగుతుందంటూ చరణ్ చెప్పారు. ఇక చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.