English | Telugu

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 హోస్ట్‌గా బాలయ్య.. ఇదిగో క్లారిటీ!

నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లో ఎంతటి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెబుతారో, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతగా హుషారెక్కిస్తారో అందరికీ తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ షో ద్వారా బాలయ్య ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఫెరోషియస్‌గా కనిపించే బాలయ్య ఈ షోలో ఎంతో సరదాగా గెస్ట్‌లతో మాట్లాడడం, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ షోలో టాలీవుడ్‌ ప్రముఖులెంతో మంది పాల్గొన్నారు. ఇక బిగ్‌ బాస్‌ షో గురించి, దానికి ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలుసు. ఈ షో జరుగుతున్నన్ని రోజులూ అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. అంతలా జనంలోకి వెళ్లిపోయిన ఈ షోకి సంబంధించిన సీజన్‌ 9ని నిర్వహించే బాధ్యతను బాలకృష్ణకు అప్పగిస్తున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్‌స్టాపబుల్‌ను ఎంతో సమర్థవంతంగా హోస్ట్‌ చెయ్యడం వల్ల అతన్నే ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌ 9కి సెలెక్ట్‌ చేశారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చేసింది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 హోస్ట్‌గా బాలయ్య రాబోతున్నాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది. ఈ షో మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాతి సీజన్‌ను నాని చేశారు. మూడో సీజన్‌కి అక్కినేని నాగార్జునను సెలెక్ట్‌ చేశారు నిర్వాహకులు. ఇక అప్పటి నుంచి 8వ సీజన్‌ వరకు నాగార్జుననే కంటిన్యూ చేశారు. 9వ సీజన్‌కి కూడా ఆయనే ఉంటారని మొదట్లో అనుకున్నారు. అయితే నాగార్జున సినిమాలతో బిజీగా ఉన్నారని, అందుకే నిర్వాహకులు బాలయ్యను అప్రోచ్‌ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ, అది వాస్తవం కాదు. సీజన్‌ 9 చేసేందుకు నాగార్జున ఓకే చెప్పారని తాజా సమాచారం. ఈ షో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి సీజన్‌ను కొత్తగా ప్రజెంట్‌ చేస్తుండడంతో బిగ్‌బాస్‌ షోపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రాబోయే 9వ సీజన్‌ మరింత కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సీజన్‌ను బాలయ్య చెయ్యబోతున్నారనే వార్తకు బ్రేక్‌ పడినట్టే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.