English | Telugu

యాంకర్ రవి వైల్డ్ కార్డు ఎంట్రీ నుండి తప్పుకుంటున్నాడా!

యాంకర్ రవి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అందరు నిజమే అనుకున్నారు కానీ ఇప్పుడు వెళ్లడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.

బిగ్ బాస్ ఆట అంటే మామూలు విషయం కాదు. డబ్బులు వస్తాయని.. నేమ్ వస్తుందని ఫేమస్ అయిపోతాం అని ఆశపడి వెళ్తే.. వచ్చేవారికి వస్తుందేమో కానీ.. ఉన్నది కాస్తా ఊడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే.. విన్నర్ అయ్యేది ఒక్కడే. కానీ.. వాడ్ని గెలిపించడానికి మిగిలిన 20 మంది జీవితాలతో ఆటాడేస్తాడు బిగ్ బాస్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వబోతుంది.

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌గా వెళ్తున్నాడంటే.. అతనే విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ.. అతనికి ఉన్న మంచి పేరుని బిగ్ బాస్ వాళ్లు తీసిపారేశారు. ముఖ్యంగా యాంకర్ లహరి ఇష్యూలో యాంకర్ రవిని పెద్ద విలన్‌గానే చూపించారు. పెళ్లైనా కూడా లహరి ఫేమ్ కోసం తన వెంటపడుతుందని.. వద్దని చెప్పినా వినడం లేదని రవి.. నటి ప్రియతో అనడం.. ప్రియ ఆ విషయాన్ని లహరితో చెప్పడం.. ఆ ఎపిసోడ్‌లో రవి ఇంత క్యారెక్టర్ లెస్ ఫెలోనా అన్నట్టుగా చూపించారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. బిగ్ బాస్ ఎడిటింగ్‌ని తాను ఎలా బలి అయ్యాడో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు యాంకర్ రవి. మరి ఇప్పుడు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. కానీ చివరి నిమిషంలో రెమ్యునరేషన్ దగ్గర కుదరలేదని, ఇంకా అగ్రిమెంట్ ఓకే కాలేదని లాస్ట్ మినట్ వరకు తెలియదంటూ బిబి అప్డేడ్స్ ఇచ్చేవారు చెప్తున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.