English | Telugu

అమెరికాలో నీకు లింకులు పంపాను... 12 సంవత్సరాల మెగా వేడుకలో ముదిరిన వివాదం


జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మెగా సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో జబర్దస్త్ కొత్త, పాత టీమ్ లీడర్స్ అలాగే యాంకర్స్, కమెడియన్స్ అందరూ వచ్చారు. ఈ షో ఆగష్టు 1 న రాబోతోంది. ఈ షో ప్రోమో ఒకటి రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి అనసూయ కూడా వచ్చింది. అనసూయ మీద ఆది వేసిన డైలాగ్ కి ఫుల్ ఫైర్ అయ్యింది. "అబ్బో నీ అమ్మ గొప్పదే" అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ అనసూయ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. "నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఈ స్టేజి మీద మీ అందరినీ మళ్ళీ చూడడం ..పొట్ట లోపలికి అనుకో ఆది" అనేసింది అనసూయ. ఆది పొట్ట మొత్తాన్ని బయట పెట్టేసి తన్మయత్వంలో ఆమె మాటలు వింటూ ఉన్నాడు. ఇంతలో అనసూయ వేసిన ఆ పొట్ట డైలాగ్ కి ఆది షాకై సరిగ్గా కూర్చున్నాడు. ఇక నాగబాబు ఐతే ఎప్పటిలానే హా హా హా అంటూ గట్టిగా స్టేజి అదిరిపోయేలా నవ్వారు. "అను ఇప్పటివరకు ఆది గారి కార్నర్ సీట్ లో కూర్చుని ఉన్నారు స్ట్రైట్ గా మీకు కనబడాలని" అంటూ ఇంద్రజ ఆది మీద కంప్లైంట్ చేశారు. "బాబు గారు ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నానో తెలుసా నేను వెళ్లే ముందు ఆది వద్దు ఆది వద్దు నాకు కొన్ని నేను మైక్ లోనే అన్ని చెప్పేస్తాను..నేను స్కిట్ చేసి నిన్ను ఎంత ఎంకరేజ్ చేసాను నువ్వు ఎక్స్క్లూజిటివిటీ ఏడవలేదు అది నా ఏడుపు" అంటూ అనసూయ ఆది గురించి చెప్పింది. మధ్యలో కాసేపు వాళ్ళ మధ్య ఏదో మాటల యుద్ధం ఐతే జరిగిందని తెలుస్తోంది.

ఆ తర్వాత ఆది "అరేయ్ నువ్వు అమెరికా వెళ్లినా కూడా నీకు లింకులు పంపించారా. అదిరా మన లింకు.. ఏమనుకుంటున్నవారు నువ్వు " అన్నాడు. ఆ తర్వాత అనసూయ సీరియస్ గా ఆది దగ్గరకు వచ్చి "ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను ఈ షో నుంచి వెళ్ళిపోయింది" అంటూ ఫైర్ అయ్యింది. దాంతో ఆది కూడా షాకయ్యాడు. ఐతే అనసూయ యాంకర్ గా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆది వల్లనే షో నుంచి బయటకు రావాల్సి వచ్చిందంటూ కూడా అనసూయ అప్పట్లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.